close
Choose your channels

Bigg Boss Telugu 7 : ‘‘కుస్తీ’’మే సవాల్ అన్న కంటెస్టెంట్స్.. ఆ ఇద్దరూ ఫైనల్‌కి, టేస్టీ తేజాకి షకీలా ముద్దు

Thursday, September 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నామినేషన్ల పర్వం ముగియడంతో హౌస్‌లో పులిహోర కలిపే కార్యక్రమాలు మొదలయ్యాయి. రతిక వేసిన ప్లాన్‌కు టేస్టీ తేజ బలి పశువు కాగా.. శివాజీ తన యాటిట్యూడ్ చూపించడం మొదలుపెట్టారు. బిగ్‌బాస్ అంటేనే గేమ్‌లు, టాస్క్‌లు కదా. దీనిలో భాగంగా 14 మంది కంటెస్టెంట్స్‌కి తొలి టాస్క్ ఇచ్చారు. ‘‘ఫేస్ ద బీస్ట్’’ అనే గేమ్‌లో గెలిచిన వాళ్లకు హౌస్‌లో కన్ఫర్మేషన్‌తో పాటు ఐదు వారాల ఇమ్మూనిటీ పొందుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అలాగే గెలిచినవాళ్లు నామినేషన్, ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతారని బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ హుషారుగా టాస్క్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కానీ చివరికి అది కుస్తీ పోటీ అని తెలిసేసరికి షాక్ అయ్యారు. అయినా చేసేదేం లేక కిందా మీద పడ్డారు.

అయినప్పటికీ టాస్క్‌లో చాలా ఫన్ క్రియేట్ అయ్యింది. అమ్మాయిలు మాత్రం కుస్తీ ఎలా పట్టాల్రా బాబు అని తలలు పట్టుకున్నారు. షకీలా తాను రింగ్‌లోకి వెళ్లనంటూ ఏడవగా.. టేస్టీ తేజ సైతం రింగ్‌లోకి వెళ్లడానికి మారాం చేశాడు. ఎలాగోలా అడుగుపెట్టి మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీలు అలా వెళ్లి ఇలా వచ్చేశారు. రింగ్‌లో ఎక్కువ సేపు వున్న అబ్బాయి, అమ్మాయి ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా అబ్బాయిల్లో ఆట సందీప్, అమ్మాయిల్లో ప్రియాంక జైన్ టాప్‌లో నిలిచారు.

ఇంత టెన్షన్‌లోనే టేస్టీ తేజకు మేకప్ చేసి అందంగా రెడీ చేసింది శుభశ్రీ. రతిక, గౌతమ్ కూడా ఇందుకు హెల్ప్ చేశారు. తేజను రెడీ చేసిన తర్వాత సో క్యూట్ అనే పాట అందుకున్నారు అమ్మాయిలు. ఇంతలో షకీలా వచ్చి తేజ నుదుటిపై ముద్దు పెట్టింది. తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని వ్యాఖ్యానించింది. ఇవాళ కూడా తేజ అందరినీ నవ్విస్తూ ముందుకు సాగిపోయాడు. ఎవరు తన మీద జోకులు వేసినా .. సరదాగా తీసుకుంటూ షోలో జోష్ తీసుకొస్తున్నాడు. అయితే ఫేస్ ది బీస్ట్ టాస్క్‌లో ఆట సందీప్‌కు తనకు కేవలం 5 సెకన్ల టైమ్ గ్యాప్ మాత్రమే వుండటంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనలై కంటతడి పెట్టాడు . ఇది కొందరు కంటెస్టెంట్స్‌కు నచ్చలేదు. పల్లవి ప్రశాంత్ కావాలనే సింపథీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని అమర్‌దీప్ విమర్శించాడు.

ఇకపోతే.. 14 మంది కంటెస్టెంట్స్ ఉన్న హౌస్లో మొదటి వారం 8 మంది నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, దామిని, ప్రిన్స్ యావర్, షకీలా, శోభిత శెట్టి, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. సెప్టెంబర్ 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా నచ్చిన కంటెస్టెంట్‌కి ఓటు వేయవచ్చు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణలు మంచి ఓటింగ్‌తో వున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.