శ్రీలంక బాంబు దాడిలో తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత 

  • IndiaGlitz, [Monday,April 22 2019]

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లు ఈస్టర్‌డే నాడు రక్తపాతాన్నిసృష్టించాయి. ఈ నరమేధంలో వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. కాగా.. ప్రమాదం నుంచి కొందరు ఆంధ్రులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

అనంతపురం జిల్లాకు చెందిన కొందరు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ప్రమాదం నుంచి వాళ్లంతా క్షేమంగా బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు స్వల్ప గాయమైంది. నలుగురు స్నేహితులతో కలిసి సురేంద్రబాబు శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు.

కొలంబోలోని షంగ్రీలా హోటల్‌లో ఉన్నప్పుడు సమీపంలోనే ఒక్కసారిగా బాంబుపేలింది. షంగ్రీలా హోటల్‌లో అల్పాహారం తింటుండగా సమీపంలో పేలుడు జరిగినట్టు అనంతపురం బృందం తెలుసుకుంది. అదే సమయంలో ఆందోళన చెందవద్దని మైక్ ద్వారా హోటల్ సిబ్బంది చెప్పిన కారణంగా తోపులాట జరిగింది.

ఈ గందరగోళంలో అద్దం తగిలి సురేంద్రబాబుకు ముక్కుకు స్వల్ప గాయమైంది. అక్కడినుంచి హడావుడిగా బయటకు వచ్చిన వారందరి పాస్ పోర్టులు, ఇతర పత్రాలన్నీ హోటల్ గదిలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన వారిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు విదేశాంగ శాఖ శ్రీలంక సర్కార్‌తో చర్చలు జరుపుతోంది.

More News

జీవీఎల్, విజయసాయిపై బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు

మే-23 తర్వాత వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నిత్యం ప్రజలకు సేవ చేయడమే జనసేన చెప్పే థ్యాంక్స్

మనస్ఫూర్తిగా, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మన పార్టీ  చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుంని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం!

శ్రీంలక రాజధాని కొలంబోలో జరిగిన ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది!.

బుల్లితెర‌పై

ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఆ తర్వాత అనేక మాధ్యమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి.

బిగ్‌బాస్ అనుష్క

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ కార్యక్రమానికి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో మొదటి బిగ్‌బాస్ షో జరిగిన విషయం తెలిసిందే.