బీజేపీలోకి ‘సమంత’ సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

  • IndiaGlitz, [Wednesday,June 26 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత పలువురు టీడీపీ ముఖ్యనేతలు.. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే నేతలు సైతం ఢిల్లీ వేదికగా కాషాయం కండువాలు కప్పుకున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు టీడీపీ విలవిల్లాడుతోంది. బుధవారం నాడు గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారనే వార్త  ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనగానితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీలోనే తిష్టవేశారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని గంటల్లో కాషాయ కండువాలు కప్పుకుంటారని తెలుస్తోంది.

మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు!

కాగా.. ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీ నేతల వద్దకు దగ్గరుండి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రేపల్లె నియోజకవర్గం నుంచి సత్యప్రసాద్ వరుసగా రెండో సారి గెలుపొందారు. అంతేకాదు.. నందమూరి కుటుంబంతో అత్యంత సాన్నిహిత్య సంబంధాలున్న నేతలు సైతం కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకే కాదు.. నందమూరి కుటుంబానికి సైతం పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

సమంత ప్రమోట్ చేసింది ఈయన్నే!

ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌కు మీ అమూల్యమైన ఓటేసి.. వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఆయన్ను ప్రమోట్ చేసింది. కాగా ఆయన అనుకున్నట్లుగానే టీడీపీకి గడ్డు రోజులున్నప్పటికీ అనగాని మాత్రం గట్టెక్కారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవ్వడంతో టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

నవ్యాంధ్రలో చంద్రబాబుకు కొత్త ఇళ్లు దొరికిందోచ్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఇప్పటికే అమరావతిలోని ఉండవల్లిలో ఉండే ప్రజావేదికను అధికారులు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.

రైతన్నకు జగన్ సర్కార్ శుభవార్త.. టీడీపీకి మరో షాక్!

వైసీపీ అధికారంలోకి వస్తే రైతన్నలకు శుభవార్త చెబుతామని.. ముఖ్యంగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో పదేపదే వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.

పీవీ, ప్రణబ్‌‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం నేతల నోరు జారుడు ఎక్కువైంది. మీడియా గొట్టాలు దొరికితే చాలు..

సెంటర్ ఏదైనా ఓకే.. దమ్ముంటే రా.. టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.

దొడ్డ మ‌న‌సు చాటుకున్న నిఖిల్‌

యువ హీరో నిఖిల్ త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నాడు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌చ్చిన‌ప్పుడు త‌న శ‌క్తిమేర స‌హకారం అందించే హీరో నిఖిల్ .