close
Choose your channels

మరో షాకింగ్ : త్వరలో బీజేపీలోపీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా!

Thursday, June 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరో షాకింగ్ : త్వరలో బీజేపీలోపీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా!

ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో టీడీపీ దుకాణం ఉంటుందా..? క్లోజ్ అవుతుందా..? అన్న రీతిలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలో కాషాయ కండువాలు.. మరికొందరు రాజ్యసభ ఎంపీలు, లోక్‌సభ ఎంపీలు, టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీకి చెందిన కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నట్టుండి బాంబు పేల్చారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందా..? ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారా..? అనేది తెలియని పరిస్థితి. ఇంతకీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని చెప్పిన కీలక నేత ఎవరు..? ఎందుకు ఆ మాటలు అన్నారు..? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

వాళ్లంతా వచ్చేస్తున్నారు!

ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నేత మరెవరో కాదు.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు, బీజేపీ కీలకనేత విష్ణువర్ధన్ రెడ్డి. గురువారం రాత్రి ఎంపీల చేరిక అనంతరం ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాలనుంచి వచ్చేసరికి టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. అంతటితో ఆగని ఆయన.. ఏపీ శాసనసభ, శాసనమండలిలో టీడీపీకి చెందిన 2/3 వంతు సభ్యులు బీజేపీలోకి రాబోతున్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు. టీడీపీకి టాటా చెప్పాలనుకుంటున్న నేతలంతా మాతో టచ్‌లో ఉన్నారన్నారు. అంతేకాదు.. లోక్‌సభలో టీడీపీ సభ్యులు కూడా మా దగ్గరికి రాబోతున్నారని.. వాళ్లతో కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు.

టీడీపీది ముగిసిన అధ్యాయం..!

"రాయలసీమకు చెందిన టీడీపీ కుటుంబాలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు. వారందరినీ ఎప్పుడు ఎలా చేర్చుకోవాలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. టీడీపీ ఏపీలో ఇక ముగిసిన అధ్యాయం. చంద్రబాబు నాయకత్వంపై అందరూ నమ్మకం కోల్పోయారు. చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ చేతుల్లో పార్టీ ఉన్నంత కాలం ఇంతే ఉంటుంది. చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారు.. అందుకే విదేశాలకు వెళ్లిపోయారు. కులాల వారీగా చంద్రబాబు చేసిన పాలనే ఆయనను ముంచేసింది" అని విష్ణు చెప్పుకొచ్చారు.

వైసీపీకి ప్రతిపక్షం మేమే..!

"కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశంలాంటి సమావేశాలు ఇంకా మరికొన్ని జరుగుతాయి. వారందరూ ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. రాబోయే వారంరోజుల్లో ఏపీలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే. వైసీపీ కాంగ్రెస్‌కు ప్రతిరూపం. నాడు కాంగ్రెస్‌లో ఉన్న నేతలే ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉంటాం. మేం ఫిరాయింపుల్ని ప్రోత్సహించం కానీ 2/3 వంతు మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వస్తామంటేనే పార్టీలోకి తీసుకోబోతున్నాం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఫిరాయింపుల కిందికు రాదు" అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

బీజేపీలో చేరిన ఎంపీలకు షాకింగ్ న్యూస్...

నలుగురు టీడీపీ ఎంపీలూ సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న టీడీపీ నేతలు బీజేపీలోకి వచ్చినా ఆ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆ నలుగురు ఎంపీలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే ఇందులో రెండో ఆలోచనే ఉండదని విష్ణువర్థన్‌రెడ్డి తేల్చిచెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.