close
Choose your channels

‘బీజేపీలో టీడీపీ విలీనం.. తాళి కట్టించుకుని కాపురం చేస్తాం!’

Wednesday, July 10, 2019 • తెలుగు Comments

‘బీజేపీలో టీడీపీ విలీనం.. తాళి కట్టించుకుని కాపురం చేస్తాం!’

అవును మీరు వింటున్నది నిజమే.. బీజేపీలో టీడీపీ విలీనం కానుందట. మళ్లీ బీజేపీతో కలిసి తాళి కట్టించుకుని కాపురం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హల్ చేస్తున్నాయి. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన జేసీ ఈ హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. "త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనమవుతుంది. మేమే బీజేపీలో తాళి కట్టించుకుంటాం. బీజేపీతో మళ్లీ కాపురం చేస్తాము. నరేంద్రమోదీకి చంద్రబాబు ఐడియాలు అవసరం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు" అని జేసీ చెప్పుకొచ్చారు.

కాగా.. మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా పెద్దగా కీలక నేతలు కనిపించలేదు. ఆయన పర్యటించిన మరుసటి రోజే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం జేసీ బ్రదర్స్ టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజా వ్యాఖ్యలతో ఆ చేరిక దాదాపు కన్ఫామ్ అయిపోయిందని.. అంతేకాదు చంద్రబాబే దగ్గరుండి ఇలా చేరికలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ రాజకీయాల్లో అందరిదీ ఒక రూట్ అయితే జేసీ బ్రదర్స్ ది సపరేట్ రూట్. ఈ బ్రదర్స్ ఏది చేసినా డిఫరెంట్‌గానే ఉంటుంది. ఇందుకు నిదర్శనమే జేసీ ప్రభాకర్, దివాకర్ ఇది వరకు మీడియా ముందు నోరు జారిన మాటలే. అయితే తాజా వ్యాఖ్యలతో చంద్రబాబు సైతం ఆలోచనలో పడ్డారట. జేసీ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz