మూడో రోజు ముగిసిన టీడీపీ శిక్షణ తరగతులు


Send us your feedback to audioarticles@vaarta.com


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమం మూడో రోజు విజయంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నాయకులు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "అధికారం కోసమో ఆర్థిక లాభాల కోసమో రాజకీయాల్లోకి ఎవరూ రాకూడదు.. రాజకీయనాయకుడు అంటే ప్రజలకు సేవకుడై ఉండాలి. ప్రజల సేవే పరమాత్మ సేవగా భావించి రాజకీయాల్లో రాణించే వ్యక్తులే ప్రజల హృదయాలను గెలుచుకొని శాశ్వతంగా రాజకీయాల్లో మనగలరు. ప్రజలే దేవుళ్లు ప్రజా స్వామ్యమే దేవాలయం అనే నినాదంతో పుట్టిన పార్టి టీడీపీ. ప్రజలు కూడు గుడ్డ నీడకోసం అల్లాడకూదని.. నాడు అన్న ఎన్టీఆర్ మహోన్నతమైన ఆశయంతో ముందు సాగి.. పేదల ఉన్నతికి, వారి ప్రగతికి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు." అని అన్నారు.
అన్నగారి ఆశయాలను కొనసాగిస్తూ నవనిర్మాణ సమాజానికి పెద్దపీట వేస్తూ.. నాడే విజన్ 2020 తో ఐటీ విప్లవాన్ని నాటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీసుకు వచ్చి హైదరాబాద్ ను ఐటీకి మేటిగా నిలిపిన చంద్రబాబు ముందుచూపును అంతా పొగిడారు.
మంచి సమాజం నిర్మిద్దామన్న ఆలోచనలు లేని నాయకులు వారి స్వాలాభాల కోసం ఆలోచిస్తే.. చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి.. ప్రగతి కోసం ప్రతినిత్యం పరితపిస్తున్నారని అన్నారు నేతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments