MLC Elections : వైసీపీకి షాకిచ్చిన పట్టభద్రులు.. మూడింట్లో రెండు టీడీపీకే, మరో చోట హోరా హోరీ

  • IndiaGlitz, [Saturday,March 18 2023]

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి పట్టభద్రులు షాకిచ్చారు. శాసనమండలిలోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ స్థానంలో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమలోనూ వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. క్షణ క్షణానికి ఆధిక్యం మారుతూ వుండటంతో అభ్యర్ధుల్లో, పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో టీడీపీ ప్రభంజనం:

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వేపాడ చిరంజీవి రావుకు వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. పోలైన 2,01,335 ఓట్లను 8 రౌండ్లలో లెక్కించగా.. తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీకి 82,958 ఓట్లు.. వైసీపీకి 55,749 ఓట్లు వచ్చాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్‌ సహా స్వతంత్ర అభ్యర్ధులు 33 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం విషయానికి వస్తే.. టీడీపీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్‌కు 1,12,686 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి శ్యాంప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రి శ్రీకాంత్ విజయాన్ని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.

పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా :

పశ్చిమ రాయలసీమ విషయానికి వస్తే.. ఇక్కడ టీడీపీ , వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 8 రౌండ్ల ఓట్లను లెక్కించారు. అప్పటి వరకు వైపీపీ అభ్యర్ధి రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి రామ్‌గోపాల్ రెడ్డికి 73,229 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధి 1,449 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. మొత్తం 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి వుండగా.. తొలి ప్రాధాన్య ఓట్లను లెక్కించి, తర్వాత రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపడతారు.

More News

Ram Charan, Amit Shah:అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ.. చివరి వరకు లీక్ కాకుండా జాగ్రత్తలు, బీజేపీ పెద్దల వ్యూహామేనా..?

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు యువ హీరో రామ్‌చరణ్ కలిశారు.

IAS Krishna Teja:కలెక్టర్ అంకుల్.. తెలుగు ఐఏఎస్‌పై కేరళ వాసుల అభిమానం, వేణుగానంతో ఫేర్‌వెల్

జిల్లా కలెక్టర్.. భారతదేశంలోని పాలనా వ్యవస్థలో ఆయన పాత్ర కీలకమైనది.

Ram Charan:ఢిల్లీలో రామ్‌చరణ్‌కు ఘనస్వాగతం.. నేడు ప్రధాని మోడీతో వేదిక పంచుకోనున్న చెర్రీ, చిరు సత్కారం కూడా..!!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే.

స్వప్నలోక్ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం , నోటీసులిచ్చినా మారని యాజమాన్యం

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

swapnalok complex : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

సికింద్రాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.