ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా టీమ్-5 విడుదల

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

భారత జాతీయ క్రికెట‌ర్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఊపిరి, ప్రేమ‌మ్, మ‌జ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాల‌కు సంగీతం అందించిన గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధ‌మైంది.

దర్శకుడు సురేష్ గోవింద్ మాట్లాడుతూ - ''ఈనెల 21న విడుద‌ల కానున్న మా టీమ్-5 చిత్రం కోసం ప‌ని చేసిన వారికి, మాకు సాయం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థ్యాంక్స్. ఈ సినిమా ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి త‌ప్ప‌కుండా న‌చ్చేలా ఉంటుంది అన్నారు. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీమ్ 5 చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందింది. గోపీసుంద‌ర్ సంగీతం అందించ‌న ఈ చిత్రం యొక్క పాట‌లు మ‌ధుర ఆడియో ద్వారా విడుద‌లై, పాట‌లు బాగా విజ‌య‌వంతం అయ్యాయి'' అన్నారు.

టీమ్ 5 చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి గోపి సుందర్ చక్కటి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో శ్రీశాంత్, నిక్కీ మరియు పర్లీ చాల చక్కగా నటించారు. టీమ్ 5 అనేది ఐదుగురు స్నేహితులు, బైక్ రేసింగ్ పైన నడిచే కథ. ఇందులో నిక్కీ, శ్రీశాంత్ ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. శ్రీశాంత్ కి పర్లీ సోదరి గా నటిస్తుంది. శ్రీశాంత్ ఈ చిత్రంలో తన నటన, డాన్స్ లతో అదరగొట్టాడు. ఈ చిత్రం యువత ని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను." అని అన్నారు.

హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ- " ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా మరియు చిత్రం ఇంత బాగా వచ్చేలా సహకరించినందుకు చిత్ర యూనిట్ సభ్యులకి ధన్యవాదాలు. చాల ఓపికగా నాకు సహకరించిన నిర్మాత మరియు టీమ్ కి థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇస్తుంది. నాకు హైదరాబాద్ అంటే చాల ఇష్టం. ఇక్కడి అభిమానులు క్రికెటర్ గా నన్ను బాగా అభిమానించే వారు ఇప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను." అని అన్నారు.

నటీనటులు : శ్రీశాంత్, నిక్కీ గర్లాని, పర్లీ, మకరంద్ దేశ్ పాండే.

రచయిత, దర్శకుడు: సురేష్ గోవింద్, నిర్మాత : రాజ్ జకారియస్, సహ నిర్మాత : అన్సార్ రషీద్, సంగీతం : గోపి సుందర్, ఛాయాగ్రహణం : సాజిత్ పురుషన్, ఎడిటర్ : దిలీప్ డెన్నిస్, ఆర్ట్ డైరెక్టర్ : సాహస బాల, కాస్ట్యూమ్ డిజైనర్: సునీత ప్రశాంత్, స్టిల్స్ : SP ఆరుకట్టు, ప్రొడక్షన్ కంట్రోలర్ : శ్యామ్ ప్రసాద్,పీఆర్వోః గాండ్ల‌ శ్రీనివాస్.

More News

బృందావనమది అందరిది మూవీ తో దర్శకుడిగా మారుతున్న రచయిత శ్రీధర్ సీపాన

పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి బృందావనమది అందరిది అనే టైటిల్ ను ఖరారు చేశారు.

'వైశాఖం' బి.ఎ.రాజుగారికి, జయగారికి మంచి పేరు తెస్తుంది - కింగ్ నాగార్జున

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం`. ఈ సినిమా జూలై 21న విడుదలవుతుంది.

చెర్రీ దంపతులు పెద్ద మనసు

పరాయి రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా 65 మంది మరణించారు. ప్రజలు కనీస అవసరాలైన తిండి, నీరు లేక ఇబ్బందలు పడుతున్నారు.

రామ్ చరణ్ కొత్త ఆలోచన...

మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగస్థలం 1985` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు.

బాలీవుడ్ టు హాలీవుడ్...

హాలీవుడ్ చిత్రాల్లోని సన్నివేశాలను టెక్నాలజీని మన సినిమావాళ్లు ఫాలో అవుతుంటారు. కానీ తొలిసారి హాలీవుడ్ సంస్థ, బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయనుంది.