close
Choose your channels

కోర మీసంతో డిఫరెంట్ లుక్‌లో తేజ సజ్జ: ఆకట్టుకుంటున్న 'హను-మాన్' గ్లిమ్స్‌

Saturday, September 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోర మీసంతో డిఫరెంట్ లుక్‌లో తేజ సజ్జ: ఆకట్టుకుంటున్న హను-మాన్ గ్లిమ్స్‌

బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి..ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు ఈ కుర్రాడు హీరోగా మారి సినిమాలతో అలరిస్తున్నాడు. సమంత నటించిన ‘‘ ఓ బేబీ ’’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీరెడ్డి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ను అందుకుంది. తాజాగా మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు తేజ. ఈ సినిమాకు ‘‘ హను-మాన్ ’’ అనే సినిమా చేస్తున్నాడు.

కోర మీసంతో డిఫరెంట్ లుక్‌లో తేజ సజ్జ: ఆకట్టుకుంటున్న హను-మాన్ గ్లిమ్స్‌తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌తో కల్కి అనే సినిమా చేశాడు ప్రశాంత్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్‌లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

కోర మీసంతో డిఫరెంట్ లుక్‌లో తేజ సజ్జ: ఆకట్టుకుంటున్న హను-మాన్ గ్లిమ్స్‌సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ హనుమంతు అనే పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటుగా ఓ గ్లిమ్స్‌ని మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌లో తేజ సజ్జా అడవిలో ఒక చెట్టుపై స్లింగ్ షాట్‌తో నిలబడి కనిపిస్తున్నాడు. కోరమీసంతో కనిపిస్తున్న గెటప్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.