close
Choose your channels

తేజ స్ట్రాంగ్ వార్నింగ్‌

Thursday, May 23, 2019 • తెలుగు Comments

తేజ స్ట్రాంగ్ వార్నింగ్‌

డైరెక్ట‌ర్ తేజ త‌న సినిమా 'సీత‌'ను విడుద‌ల కానీయ‌కుండా ఆపుతామ‌ని బెదిస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సీత‌'. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత సినిమా టైటిల్‌కు, ట్రైల‌ర్‌లోని డైలాగ్స్‌, స‌న్నివేశాలు వేరుగా ఉన్నాయ‌ని, హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని బిజెవైఎం అనే హిందూవాద సంస్థ పేర్కొంది.

అంతే కాకుండా, 'సీత‌' సినిమాను విడుద‌ల కానీయ‌మ‌ని తెలియ‌జేసింది. అయితే దీని పై తేజ స్పందించారు. "సీత సినిమాకు 'సీత‌' అని కాకుండా శూర్ప‌ణ‌ఖ అనే టైటిల్ పెట్టాలా? ఏంటి? అస‌లు నా సినిమాను ఎవ‌రికీ చూపించ‌ను. సినిమా సెన్సార్ పూర్త‌య్యింది. ఎవ‌రికీ చూపించాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌డొస్తాడో చూస్తాను. సినిమా చెప్పిన‌ట్లుగానే మే 24న విడుద‌ల‌వుతుంది. ఎవ‌డాపుతాడో చూస్తాను" అంటూ వార్నింగ్‌ల‌కు స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చాడు. 

Get Breaking News Alerts From IndiaGlitz