తేజు కొత్త సినిమా టైటిల్‌...

  • IndiaGlitz, [Tuesday,May 29 2018]

సాయిధ‌ర‌మ్ తేజ్‌, కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. ముందుగా అనుప‌మ‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ను అనుకున్నారు.

కానీ ఇప్పుడు అనుప‌మ స్థానంలో రితికా సింగ్ జాయిన్ అయ్యింది. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాకు చిత్ర‌ల‌హ‌రి అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. తండ్రి..కొడుకుల మ‌ధ్య ఉండే రిలేష‌న్ షిప్‌తో సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రి తేజు తండ్రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారో చూడాలి.