close
Choose your channels

ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

Wednesday, May 5, 2021 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మినీ మునిసిపల్ ఎన్నికలు ముగిశాయో లేదో.. ప్రభుత్వ అనుకూల మీడియాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కథనాలు రావడం.. అంతలోనే ఈటలపై ఎంక్వైరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం.. ఆపై ఆరోగ్యశాఖను కేసీఆర్ స్వాధీనం చేసుకోవ.. ఆపై మంత్రి పదవి నుంచి ఈటల బర్త్‌రఫ్ అన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. కనీసం ఊహకందని రీతిలో ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Also Read: హైదరాబాద్ జూలోని 8 సింహాలకూ కరోనా.. అసలెలా సోకిందంటే..

ఇక ఈటలను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేసిన మీదట కూడా తెలంగాణలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత తమ ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ ఈటల అంశంపై మాట్లాడవద్దని సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈటల తనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరడంతో పాటు తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించడంతో.. తమ మాటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు పదును పెట్టారు. ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన వద్ద ఉన్న ఆరోగ్య శాఖను మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దానం నాగేందర్ గత ఏడేళ్లుగా మంత్రి పదవికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ వచ్చారు. దానం విశ్వసనీయతను, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దానం నాగేందర్ అనుచరులతో పాటు ఆయన నియోజకవర్గంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దానం నాగేందర్ ఆరోగ్యశాఖకు తగిన వ్యక్తిగా భావించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతమేర నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.