close
Choose your channels

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

Sunday, August 2, 2020 • తెలుగు Comments

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోడంతో.. మూడు రోజులపాటు బండి సంజయ్ ఢిల్లీలో మకాం వేసి లిస్ట్‌ను ఫైనల్ చేశారు. 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో కమిటీని తయారు చేశారు. కాగా బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.

ఉపాధ్యక్షులుగా.. విజయరామారావు,చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణిని ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులుగా.. ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులుని.. కార్యదర్శులుగా.. రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి,
శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణిని.. ట్రెజరర్‌గా.. బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ(జాయింట్ ట్రెజరర్‌).. సెక్రటరీగా ఉమా శంకర్‌ని ఎంపిక చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz