close
Choose your channels

తెలంగాణ కరోనా బులిటెన్.. కొనసాగుతున్న విజృంభణ

Sunday, July 5, 2020 • తెలుగు Comments

తెలంగాణ కరోనా బులిటెన్.. కొనసాగుతున్న విజృంభణ

తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. శనివారం కూడా కరోనా విజృంభణ తెలంగాణలో కొనసాగింది. 6427 శాంపిల్స్‌ను పరిశీలించగా.. 1850 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 22 వేల 312కు చేరుకుంది. 10వేల 487 యాక్టివ్ కేసులుండగా.. నిన్న ఒక్కరోజే 1342 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా 11 వేల 537 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 288కి చేరుకుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని 1572 కేసులు నమోదవడం గమనార్హం.

Get Breaking News Alerts From IndiaGlitz