YS Sharmila: తెలంగాణ కుల గణన దేశానికే ఆదర్శం


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణలో దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపట్టిన కుల గణన సర్వేపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పని, యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉంటే.. రికార్డ్ స్థాయిలో 56 శాతం బీసీలున్నారు. అంటే, దాదాపు 90శాతం మంది వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉన్నారనే విషయం తనను విస్మయపరిచిందని అన్నారు షర్మిల.
దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ఈ కులగణన, ఆయన దూరదృష్టికి నిదర్శనమని, దేశంలోనే ఇదొక చారిత్రక ఘట్టమని అన్నారు. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని, తక్షణం ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణన చేపట్టాలని, కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినప్పటికీ.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని షర్మిల ఆరోపించారు. కేవలం బీజీపే డైరక్షన్ వల్ల ఆ సర్వే రిపోర్ట్ బయటకు రాకుండా జగన్ జాగ్రత్త పడ్డారని విమర్శించారు. బీజేపీ ఉచ్చులో పడకుండా.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు షర్మిలా రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments