నిరుద్యోగులకు తీపికబురు.. ఇవాళే 80,039 పోస్టులకు నోటిఫికేషన్, అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

నిన్నటి వనపర్తి సభలో చెప్పినట్లుగానే .. ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. భారీగా ఉద్యోగాల నియామకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు బుధవారమే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. మిగిలిన 11,103 ఖాళీలను కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని కేసీఆర్ తెలిపారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్‌తో పాటు నిరుద్యోగులకు మరో శుభవార్త కూడా అందించారు సీఎం. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం.. శాఖల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,344, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులు వున్నాయి.

More News

ఫలించని రెస్క్యూ ఆపరేషన్ .. సింగరేణిలో విషాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురూ మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో గనిలో చిక్కుకుపోయిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కాసులు కురిపించిన సమ్మక్క-సారక్క జాతర.. హుండీ ద్వారా ఎంత ఆదాయమంటే..?

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘‘సమ్మక్క సారక్క జాతర’’ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన

స్పెయిన్‌లో స్టెప్పులేస్తోన్న రామారావు

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన..

శృతి హాసన్‌కి మరో బంపరాఫర్.. చిరు పక్కన ఛాన్స్, స్వయంగా అనౌన్స్ చేసిన మెగాస్టార్

విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన అందం, నటనతో దూసుకెళ్తున్నారు. మధ్యలో కొంచెం స్లో అయినా ఇటీవలి కాలంలో

హైదరాబాద్‌‌లోని మహిళా పోలీసులకు ‘భీమ్లా నాయక్’ స్పెషల్ షో.. ఎందుకంటే..?

హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించని సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. వచ్చీ రాగానే  డ్రగ్స్ మాఫియా