close
Choose your channels

భీమ్లా నాయక్: కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ.. బెజవాడలో పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ, వైరల్

Saturday, February 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భీమ్లా నాయక్: కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ.. బెజవాడలో పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ, వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి అవరోధాలు ఎదురైన సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచకపోవడం, బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో జగన్ సర్కార్‌పై ట్రోలింగ్‌కు దిగారు . జగన్‌ ప్రభుత్వం పవన్‌ కల్యాణ్ సినిమాలపై కక్షగట్టిందని .. థియేటర్లపై ఆంక్షలు, థియేటర్ యాజమాన్యాలకు వార్నింగ్‌లు, అదనపు షోకి పర్మిషన్ నిరాకరణ.. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనంటూ ఆరోపిస్తున్నారు.

దీనిపై ఏపీ మంత్రులు సైతం అదే స్థాయిలో కౌంటరిచ్చారు. ఇలాంటి పరిస్ధితుల నడుమ బెజవాడలో పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇందులో పవన్‌కు ఓవైపు సీఎం కేసీఆర్.. మరోవైపు వంగవీటి మోహనరంగా ఫోటోలను ముద్రించారు. అంతేకాదు.. ఫ్లెక్సీ పైభాగంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ చిత్రాలను ఉంచారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసిస్తూ.. హ్యాట్సాఫ్ సీఎం సార్ అని కూడా రాయడం విశేషం. జగన్‌ మార్క్‌ ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్‌గానే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపు, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే ఈ ఫ్లెక్సీ కట్టారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇకపోతే.. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.