close
Choose your channels

తెలంగాణ రికార్డ్స్ బద్ధలు కొడుతోంది : కేసీఆర్

Monday, May 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ రికార్డ్స్ బద్ధలు కొడుతోంది : కేసీఆర్

తెలంగాణ చాలా అద్భతమైన వ్యవసాయ రాష్ట్రం.. ఇక్కడ అద్భుతమైన నేలలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నన్ని టిఫికల్ ల్యాండ్స్ మిక్స్ ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువగానే ఉందని ఆయన అన్నారు. అందువల్లే ఇక్రిశాట్ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ నగరంలోని పఠాన్‌చెరులో ఏర్పడిందన్నారు. ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని రైతు ప్రోత్సాహక, రైతు సహాయక చర్యలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ఇతర దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని.. వాటిలో ‘రైతు బంధు’ అనేది ముఖ్యమైనది అని కేసీఆర్ తెలిపారు. అలాగే రైతు బీమా సదుపాయం అనేది కూడా దేశంలో అలాగే ప్రపంచంలో ఎక్కడా లేదని తెలంగాణలో మాత్రమే అమలు అవుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కూడా తెలంగాణలో మాత్రమే ఉందని ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. అదే విధంగా ఉచితంగా వ్యవసాయానికి నీటి సరఫరా ఇస్తున్నామని.. సబ్సిడీ కూడా ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

రికార్డ్స్ తిరగరాస్తూ.. ఇతర రికార్డ్ బద్ధలు కొడుతూ..

‘రాష్ట్రంలో నల్లరేగడి, ఎర్ర రేగడి, ఇసుక నేలలు, తేలికపాటి, చౌడు భూములు ఉన్నాయి. వీటితో పాటు వాతావరణ, పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది. వాతావరణం, పర్యావరణం మండలాలు అనుకూలంగానే ఉంటాయి. అందుకే అన్ని రకాల పంటలు పండేందుకు రాష్ట్రంలో అనుకూలంగా ఉంటుంది. 900 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం ఉంది. అన్ని రకాల పంటలకు అద్భుతమైన అనుకూలత తెలంగాణకు ఉంది. అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తోంది.. అనేక రాష్ట్రాల రికార్డులను బద్ధలు కొడుతోంది. రాష్ట్రం తన సొంత రికార్డులను చెరిపేసుకుంటూ ఇతర రాష్ట్రాల రికార్డులను బద్ధలు కొడుతోంది. దేశానికి అలాగే ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ఈ ఏడాది కూడా అద్భుతమైన పంటలు పండాయి. వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వడివడిగా నడిచాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. వరదలు, తుఫాన్‌లు బలమైన ఈదురుగాలులు ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు రాష్ట్రంలో చాలా తక్కువగానే ఉంటాయి. అందువల్ల వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వృత్తి నెపుణ్యం కలిగిన రైతాంగం కూడా రాష్ట్రంలో ఉన్నారు’ అని కేసీఆర్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.