close
Choose your channels

బెజవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య.. సత్రంలో తల్లీకొడుకు, కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు

Saturday, January 8, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవల కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్ చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరవకముందే విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్, శ్రీలత దంపతులు తమ కుమారులు అఖిల్ (28), ఆశిష్ (22)తో కలిసి విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. స్థానిక కన్యకా పరమేశ్వరి సత్రంలో వీరు బస చేశారు. ఏం జరిగిందో తెలియదు గానీ వీరి కుటుంబం సూసైడ్ చేసుకుంది.
శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రూమ్.నెం.312 లో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో కృష్ణా నదిలో దూకిన పప్పుల రమేష్,పెద్ద కుమారుడు అఖిల్ గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి రమేష్ (56) మృతదేహాన్ని వెలికితీశారు. అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇతడు నిజామాబాద్‌లో ఓ పెట్రోల్ బంకును లీజుకు తీసుకుని నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.

అఖిల్ పేరిట సత్రంలో గది బుక్ చేసుకున్న ఈ కుటుంబం.. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో బంధువులకు మెసేజ్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు వీరు బంధువులకు పెట్టిన మెసేజ్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న బెజవాడ పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.