కరోనాతో చనిపోతే.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక అనుమానితులు సంఖ్య అస్సలు చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణ విషయానికొస్తే.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. కరోనాతో ఎవరైనా చనిపోతే ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయమై తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం నాడు.. చనిపోయిన వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు ఉంటారు గనుక.. ఒక్కో మత ఆచారం ప్రకారం అంత్యక్రియలకు గాను మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.

మార్గదర్శకాలివీ...

:- కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో ప్రభుత్వం నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు.
:- వారే దగ్గరుండి మరీ శ్మశానవాటికకు తరలిస్తారు.
:- అంత్యక్రియలు లేదా ఖననం వేళ కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
:- మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.
:- కరోనా మృతుల్లో హిందువులు ఉంటే, వారి మృతదేహాలను దహనం చేస్తారు.
:- ముస్లిం, క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారని ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో నిశితంగా వివరించింది.

కాగా.. చాలా మందికి తెలియక అంత్యక్రియల వేళ పెద్ద ఎత్తున వెళ్లిపోతుంటారు. తద్వారా వైరస్ ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇదివరకు ఈ విషయాలు తెలియక బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఇలానే జరగడంతో అంత్యక్రియలకు వెళ్లిన వారందర్నీ క్వారంటైన్ చేసిన సందర్భాలు కోకొల్లలు. అందుకే ఇలాంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఎవరూ ఎదుర్కోరాదని ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది.

More News

రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్న విలన్

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు అండగా చిరు

మెగాస్టార్ చిరంజీవి రీల్‌లోనే కాదు.. రియల్‌గా కూడా హీరో అనిపించుకున్న సందర్భాలున్నాయి. ఇందుకు కారణం ఆయనకున్న పెద్ద మనసే. తమకు కష్టం వచ్చింది ఆదుకోండి

టీవీ యాంకర్ శాంతి అనుమానాస్పద మృతి.. ఫోన్ స్వాధీనం!

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి (విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. నగరంలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని

పోలీసుల‌కు సెల్యూట్ చేసిన మ‌హేశ్‌, చైత‌న్య‌

క‌రోనా వైర‌స్‌ను నివారించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. క‌ర్ఫ్యూను విధించాయి. ముఖ్యంగా పోలీసు శాఖ‌వారు ప్ర‌జ‌లను రోడ్ల మీద‌కు రాకుండా

భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ఆలియా

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).