వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల పార్టీ ప్రారంభించినప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆమెను ఏదో ఒక విధంగా.. ఒకరకంగా చెప్పాలంటే సందర్భం క్రియేట్ చేసుకుని మరీ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సార్లు షర్మిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన గంగుల కమలాకర్ తాజాగా మరోసారి విమర్శించారు. మళ్లీ ఆంధ్రా శక్తులు తెలంగాణలో పురి విప్పుతున్నాయంటూ గంగుల విమర్శించారు. ఇవాళ జగనన్న బాణం వచ్చిందని.. రేపు జగనన్నే దిగుతాడు అని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక బాణం వేస్తే తాము కోటి బాణాలు వేస్తామంటూ నేడు గంగుల విమర్శించారు.

‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సీఎం అయి ఆరేళ్లైనా గడిచిందో లేదో.. మళ్లీ ఆంధ్రా శక్తులు పురివిప్పుతున్నాయి. వాళ్లు 70 ఏళ్లు పాలించి, మనను అన్ని రకాలుగా వంచించారు. ఇప్పుడు మనకు నీళ్లు, కరెంటు వచ్చే సరికి వాళ్ల కడుపుల్లో మంట మొదలైంది. జగనన్న బాణాన్ని అంటూ షర్మిలక్క ఎంట్రీ ఇస్తున్నది ఎందు కోసం? మన నీళ్లు, కరెంటును దోచుకుపోవడానికి కాదా? ఇవాళ జగనన్న బాణం షర్మిల వచ్చింది. రేపు జగనన్నే దిగుతాడు. ఆ వెంటనే చంద్రబాబు కూడా వచ్చేస్తాడు. ఇంకేముంది.. తెలంగాణలో మళ్లీ కొట్టాటలు మొదలవుతాయి’’ అని మంగళవారం ఒక ప్రెస్‌మీట్‌లో గంగుల కమలాకర్ విమర్శించారు.

తాజాగా నేడు ‘జగనన్న తెలంగాణలో ఒక బాణం వేస్తే మేము కోటి బాణాలు వేస్తాం. ప్రత్యేక రాష్ట్రం కోసం రాయల సీమవాసులు పోరాడుతున్నారు. కావాలంటే అక్కడికి వెళ్లి షర్మిల పార్టీ పెట్టాలి. కేసీఆర్‌ను కాపాడుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు’’ అని గంగుల పేర్కొన్నారు. అసలు ఎందుకు గంగుల ఇలా అడపా దడపా షర్మిలపై బాణాలు ఎక్కు పెడుతున్నారనేది అర్థం కాకుండా ఉంది. సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ప్రకారం ఆయన నడుచుకుంటున్నారా? లేదంటే షర్మిల వస్తే రెడ్డి సామాజిక వర్గం ఓట్లన్నీ చేజారిపోతాయనా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువని.. అవన్నీ చేజారిపోతే తనకు మున్ముందు కష్టమని భావించి ముందస్తుగా గంగుల కమలాకర్.. షర్మిలను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. మొత్తానికి గంగుల వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం షర్మిల పార్టీ పెట్టడం వల్ల తమకేదో నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నట్టు కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.

More News

ఐదో రోజు ‘ఉప్పెన’ ఎంత కలెక్ట్ చేసిందంటే..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం

ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3

సరికొత్త కథలను ఎంపిక చేసుకోవడం, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆచార్య క్రియేషన్స్ ప్రత్యేక గౌరవం, మంచి పేరు తెచ్చుకుంది.

‘రాధేశ్యామ్’ ఆసక్తికర ఫోటో విడుదల

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం స్టార్ట్.. ‘బాహుబలి’ రికార్డ్ బ్రేక్!

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన సినిమా వస్తోందంటేనే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిదీ ఆసక్తికరమే. ప్రస్తుతం రాజమౌళి

ఆస్ట్రేలియా పార్లమెంటులో మహిళపై అత్యాచారం!

ఆస్ట్రేలియా పార్లమెంటులోని రక్షణ మంత్రిత్వశాఖలో ఓ మహిళపై అత్యాచారం జరిగిందనే వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సదరు కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని..