close
Choose your channels

కేసీఆర్ ఏం కీలక ప్రకటన చేస్తారో.. టెన్షన్.. టెన్షన్..!

Friday, April 30, 2021 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్ ఏం కీలక ప్రకటన చేస్తారో.. టెన్షన్.. టెన్షన్..!

సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు మిశ్రమ ఫలితాన్నిచ్చాయి. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు. బుధవారం యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్‌లో సీఎంకు నెగెటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ సరిగా రాలేదని ఎంవీరావు స్పష్టం చేశారు. అయితే వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో కొన్నిసార్లు కచ్చితమైన ఫలితం అనేది రాదని.. ప్రస్తుతం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. 2, 3 రోజుల్లో మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ నిర్వహిస్తామని డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు. కరోనా సోకినప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

కాగా.. నిన్న తెలంగాణలో హైకోర్టులో నేటితో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 30తో రాత్రి కర్ఫ్యూ ముగుస్తుందని... ఆ తర్వాత ఏం చేయబోతున్నారో చెప్పాలని అడిగింది. ప్రభుత్వం ఏప్రిల్‌ 30 నాడే నిర్ణయం తీసుకోనుందని అడ్వకేట్‌ జనరల్‌ బదులిచ్చారు. ఆ నిర్ణయమేదో కోర్టుకు చెప్పాలంటూ ఆ ఒక్క అంశంపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. మే 5 నాటికి తాజా పరిస్థితులను వివరిస్తూ వేర్వేరు నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాత 15 రోజుల వరకు వైన్‌షాపులు మూసి వేయాలని ధర్మాసనం సూచించింది.

ఈ క్రమంలోనే నేడు తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోందనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు అధికారులతో నిర్వహించాల్సి ఉన్న భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారంటూ ఇప్పటికే ఓ వార్త వైరల్ అవుతోంది. వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూనే కొనసాగిస్తారా? లేదంటే మినీ లాక్‌డౌన్ విధిస్తారా? అనేది కీలకంగా మారింది. మరోవైపు రంజాన్ పండుగతో పాటు మేలో పెళ్లిళ్ల సీజన్ ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. అయితే కేసీఆర్‌కు మిశ్రమ ఫలితం వచ్చిన నేపథ్యంలో అధికారులతో భేటీ అవడం కష్టమేనని తెలుస్తోంది. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? లేదంటే పరిస్థితులకు అనుగుణంగా తానే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై టెన్షన్ టెన్షన్‌తో జనం ఎదురు చూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.