close
Choose your channels

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్.. కేర్‌కు తరలింపు

Thursday, July 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. ఇటీవల సడలింపులివ్వడంతో ప్రమాదాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

పోలీస్ అకాడమీ నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి వీవీ శ్రీనివాస్ ఇంటికి వెళుతుండగా ఓఆర్ఆర్ వద్దకు రాగానే అదుపు తప్పి ఆయన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే ప్రమాంలో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు అయింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.