ఇకపై మీటర్ రీడింగ్ మనమే తీసుకోవచ్చు..

  • IndiaGlitz, [Thursday,May 13 2021]

టెక్నాలజీ డెవలప్ అయ్యాక మనం పెద్దగా బయటకు వెళ్లడం కానీ.. మన ఇంటికి ఒకరు రావడం కానీ తగ్గిపోయాయి. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కరెంటు బిల్లు నుంచి అన్ని బిల్లులు ఫోన్‌లోనే కట్టేయడమే. సెకన్లలో పని అయిపోతుంది. అయితే రీడింగ్ తీయడానికి మాత్రం ఇప్పటి వరకూ ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చేవారు. ఇకపై ఈ పని కూడా స్మార్ట్ ఫోనే చేసేస్తుంది. ప్రతి నెలా మన ఇంటి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసి బిల్‌ ఇచ్చేందుకు ఇకపై సిబ్బంది రావాల్సిన పనిలేదు. మన సెల్‌ఫోన్‌తో మీటర్‌ రీడింగ్‌ని స్కాన్‌ చేసి.. బిల్లు తీసుకునే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) బుధవారం ఈ సేవలను ప్రారంభించింది.

Also Read: తెలంగాణలో కరోనా నియంత్రణలోనే ఉంది: కేటీఆర్

సంస్థ ఐటీ యాప్‌లో ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ అనే ఆప్షన్‌ను జోడించి గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచింది. దీనికోసం ముందుంగా గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి TSSPDCL IT యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్‌ వినియోగిస్తున్నవారు సైతం అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌ తెరవగానే ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఆప్షన్ కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబరు, ఈమెయిల్‌, మొబైల్‌ నంబరు వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తరువాత మనం ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది.

ఆ స్కాన్ బటన్‌పై క్లిక్‌ చేసి మీటర్‌లో ‘కేడబ్ల్యూహెచ్‌’ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. మనం ఇచ్చిన వివరాలన్నీ సరిగానే ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయగానే ఆన్‌లైన్‌లో బిల్లు కనిపిస్తుంది. చెల్లింపు సదుపాయాన్ని సైతం ఈ యాప్‌లోనే పొందుపరిచారు. వినియోగదారులకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా యాప్‌లో డెమో వీడియోలను తెలుగులో అందుబాటులో ఉంచారు. కాగా... మనకంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి ఉంటే? ఆ విషయం కూడా యాప్‌లో కనబడుతుంది. మీరే ముందు రీడింగ్‌ స్కాన్‌ చేసి బిల్లు తీసుకుంటే.. రీడింగ్‌ సిబ్బందికి ‘బిల్‌ జనరేటెడ్‌’ అని సమాచారం వెళుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రీడింగ్ తీసి బిల్ కట్టేయండి.

More News

'ఆర్ఆర్ఆర్' విజువల్ వండర్ వెండితెర పైనే చూడాలి, ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో కరోనా నియంత్రణలోనే ఉంది: కేటీఆర్

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

తెలంగాణలో నిన్న ఒక్కరోజే షాకింగ్ స్థాయిలో మద్యం అమ్మకం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిందో లేదో... మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది.

తారక్‌తో మాట్లాడాను.. ఆ విషయం తెలిసి సంతోషించా: చిరంజీవి

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఇటీవల కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారక్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.

15 రోజుల తర్వాత కుటుంబాన్ని కలిసిన బన్నీ.. వీడియో వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నాడు. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన బన్నీకి కొడుకు, కూతురు నుంచి ఘన స్వాగతం లభించింది.