close
Choose your channels

మోసపోవద్దు.. అన్న సీఎం అవుతాడని చెప్పండి!

Monday, February 11, 2019 • తెలుగు Comments

మోసపోవద్దు.. అన్న సీఎం అవుతాడని చెప్పండి!

"సీఎం చంద్రబాబు ఎన్నికల టైమ్‌‌లో ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దని కార్యకర్తలంతా ప్రతి  అమ్మకు, అక్కకు, చెల్లికి గట్టిగా చెప్పండి. చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దండి.. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ‘అన్న చేయూత’ అనే కార్యక్రమం తీసుకువస్తాడు" అని అనంతపురం వైసీపీ సమర శంఖారావం సభా వేదికగా వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన "మీకు తగిలిని ప్రతీ గాయం నా గుండెకు తాకింది. ఎన్ని కష్టాలు భరించారో నాకు తెలుసు. దొంగ కేసులు పెడుతున్నారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. మీలో ప్రతీ ఒక్కర్ని నేను చూసుకుంటాను
రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చుకుంటాను. అన్నొస్తాడ‌ని అంద‌రికీ చెప్పండి" అని జగన్ చెప్పుకొచ్చారు.

అక్కా చెల్లెళ్లకు చెప్పండి!

"ప్రతి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ప్రతి అక్కాచెల్లెమ్మలకు నలభైఐదు సంవత్సరాలు వయస్సు నిండితే చాలు.. నాలుగు దఫాలుగా అన్న రూ. 75 వేలు చేతిలో పెడతాడు అని చెప్పండి..చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయాలకు మోసపొవద్దు అని చెప్పండి. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు..పొదుపు సంఘాల్లో ఉన్న అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంత అయితే అప్పుగా రుణాలు ఉంటాయో మొత్తం రుణాలు అన్ని నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతిల్లోనే పెడతాడన్నా అని చెప్పండి.. ప్రతి అక్కకు, ప్రతి అవ్వాకు చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దండి" అని ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు.

అన్న ముఖ్యమంత్రి అవుతాడ‌ని చెప్పండి! 

"రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. పెన్షన్లు రెండువేలు నుంచి మూడువేలు వరుకు పెంచుకుంటూ వెళ్తాడని చెప్పండి. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతారు. ఆ చదువులు కోసం ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు అన్న చూసుకుంటాడని చెప్పండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా లక్షల రూపాయాలు ఖర్చయే ఆపరేషన్‌ అయినా పర్వాలేదు. మన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు ఎన్ని లక్షలయినా అన్న ఖర్చుచేసి వైద్యం చేయిస్తాడు అని ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాలోని ప్రతి అంశం విపులంగా ప్రతి అక్కకు,చెల్లికి,అమ్మ కు విపులంగా చెప్పండి" అని జగన్ పేర్కొన్నారు.

మూడువేలిచ్చి దేవుడి మీద ప్రమాణం!

"చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తామన్న మూడువేల సొమ్మును మోసపోవద్దు. ఆ ఇచ్చే మూడు వేల రూపాయలు కూడా చంద్రబాబు ఎలా ఇస్తాడో తెలుసా.. ఆ డబ్బు ఇచ్చేటప్పుడు చంద్రబాబును ప్రజలను నమ్మరు.. ఎందుకంటే చంద్రబాబు ప్రజలకు చేసిందేమి లేదు. కాబట్టి ఏమిచేస్తాడో తెలుసా.. ఆ మూడు వేల రూపాయలు చేతిలో పెడుతూ దేవుడి మీద ప్రమాణం చేయించుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. మీ అందరికి ఒకటే చెబుతున్నా.. చంద్రబాబు మూడు వేలు ఇస్తే వద్దు అనొద్దు.. కుదరదు.. కనీసం ఐదువేల కావాలని అడగండి. డబ్బులు తీసుకోండి.. తీసుకునేటప్పుడు ఒక సెకను దేవుని తలుచుకోండి. ఈ రాక్షసుడికి ఓట్లు వేయం అని మనసులో చెప్పుకోండి" అని ఏపీ ప్రజలకు ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు.