షూటింగ్ అంటేనే భయపడుతున్న తెలుగు యాంకర్లు!

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

అంతా బాగుందనుకున్నా ప్రముఖ యాంకర్లతో బుల్లితెరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షూటింగ్ అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట. దీంతో ఏం చేయాలో పాలుపోక సదరు ప్రోగ్రాం నిర్మాణ సంస్థలు తల పట్టుకుంటున్నాయని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైనే షూటింగ్‌లు ఆగిపోయాయి. బుల్లితెర అయినా.. వెండితెర అయినా కొద్దిమంది ప్రముఖులతో నడిచేది కాదు.. దీనిపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. చిన్న చిన్న ఆర్టిస్టులు ఇతరత్రా సిబ్బంది మొత్తం రెండు నెలలు షూటింగ్స్ ఆగిపోవడంతో బతుకు బండిని ఎలా నడపాలో తెలియక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

ఈ విషయాలన్నీ చిత్ర సీమకు చెందిన పెద్దలు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చింది. ఇటీవల బుల్లితెర పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి షూటింగ్‌లు షురూ చేసింది. అయితే ప్రారంభించి కొద్ది రోజులు కూడా గడవక ముందే పలువురు ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. వారంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయినా సరే స్టార్ యాంకర్‌లు ససేమిరా అంటున్నారని సమాచారం.

బుల్లితెర స్టార్ యాంకర్లు సుమ, అనసూయ షూటింగ్‌ అంటేనే భయపడి పోతున్నారట. ఇప్పుడప్పుడే వద్దంటున్నారని సమాచారం. కరోనా కంట్రోల్‌‌లోకి వచ్చి పరిస్థితులు చక్కబడే వరకూ షూటింగ్‌లకు విరామం ఇవ్వాలంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వారు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయం కూడా తీసేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే సదరు షో నిర్వాహకులు వేరొకరితో వీరి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తారో లేదంటే కొద్ది రోజులు వాయిదా వేస్తారో వేచి చూడాలి.

More News

అదే జరిగితే.. అనుష్క అభిమానులకిది షాకింగ్ న్యూసే..

పేరుకే అనుష్క అయినా అభిమానులు ఎక్కువగా ఆమె ముద్దుపేరుతోనే ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు.

సత్య దేవ్, తమన్నా జంటగా కన్నడ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్.

కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు: లండన్ కింగ్స్ కాలేజ్

కరోనా మళ్లీ సోకుతుందో.. లేదో అనే సందేహాలకు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధనలు చెక్ పెట్టాయి.

ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.. ఆ స్థానంలోకి ఎవరొస్తారు?

ఏపీలో చెప్పుకోదగిన ఉద్యమాల్లో ఒకటి కాపు ఉద్యమం. తుని ఘటన రాష్ట్ర చరిత్రలోనే మరిచిపోలేనిది.

తెలంగాణలో నిన్న మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో సోమవారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అంతకు ముందు మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసులు 1200 లోపు మాత్రమే నమోదయ్యాయి.