close
Choose your channels

రోడ్డు ప్రమాదంలో తెలుగు ఆర్టిస్ట్‌ల దుర్మరణం

Wednesday, April 17, 2019 • తెలుగు Comments

రోడ్డు ప్రమాదంలో తెలుగు ఆర్టిస్ట్‌ల దుర్మరణం

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డి గూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బుధవారం ఉదయం అనంతగిరి పర్యాటక కేంద్రంలో ఎంతో ఎంజాయ్‌‌ చేస్తూ టీవీ ఆర్టిస్ట్ భార్గవి, నటి హారిక.. వినయ్, చక్రి షూటింగ్ ముగించుకున్నారు. అనంతరం తిరుగుప్రయాణం చేస్తుండగా అప్పారెడ్డి గూడ గేటు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ కొన్నది. 

ఈ ప్రమాదంలో ఇద్దరు టీవీ ఆర్టిస్ట్‌లు భార్గవి, హారిక మృతి చెందారు. ఘటనాస్థలిలోనే భార్గవి మృతిచెందగా.. అత్యవసర చికిత్సకై ఆస్పత్రికి తరలిస్తుండగా నటి హారిక కన్నుమూసింది. ఈ ఘటనలో వినయ్, కారు డ్రైవర్ చక్రి అనే ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇద్దరు ఆర్టిస్ట్‌ల మరణంతో మరోసారి చిత్రసీమలో.. వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్గవిది నిర్మల్ కాగా.. హారికది భూపాలపల్లి అని తెలిసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆర్టిస్టుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz