close
Choose your channels

Jamuna :సత్యభామ పాత్రకు జీవం పోశారు.. జమునకు చిరు, బాలయ్య, పవన్ సంతాపం

Friday, January 27, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అలనాటి నటి, తెలుగు వారి సత్యభామ జమున కన్నుమూయడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ స్వర్ణ యుగానికి ప్రతినిధులుగా వున్న ఒక్కక్కొరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుండటంతో కళామతల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇదిలావుండగా.. జమున మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. టాలీవుడ్‌కు ఆమె చేసిన సేవలను కొనియాడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి :

‘‘సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను’’

పవన్ కల్యాణ్ :

‘‘ ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను ’’.

నందమూరి బాలకృష్ణ :

‘‘అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు... నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి... వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’.

మహేశ్ బాబు :

‘‘జమున గారు ఇక లేరని తెలిసి షాక్‌కు గురయ్యా. ఆమె చేసిన ఐకానిక్ పాత్రలు, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఆమెను గుర్తుంచుకునేలా చేస్తాయి. జమున గారి కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి’’ .

జూనియర్ ఎన్టీఆర్ :

‘‘దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ’’.

నందమూరి కళ్యాణ్‌రామ్ :

‘‘మహానటి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన. జమున గారి కుటుంబసభ్యులు మరియు వారి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి.’’

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.