వాల్మీకి కోసం తెలుగమ్మాయి

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

'వాల్మీకి' సినిమా గురించి ఈ మ‌ధ్య త‌ర‌చూ అప్‌డేట్‌లు వినిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం చిత్రం షూటింగ్ ప‌నుల‌న్నీ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. బాబాయ్‌కు 'గ‌బ్బ‌ర్‌సింగ్‌'లాంటి హిట్ ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్... అబ్బాయి వ‌రుణ్‌తేజ్‌తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, వ‌రుణ్ క‌లిసి గ‌తంతో 'ముకుంద‌' అనే సినిమాకు ప‌నిచేశారు.

ఈ సినిమాలో మ‌రో నాయిక కూడా ఉంది. ఆ పాత్ర కోసం హైద‌రాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కృష్ణ మంజూష‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు స‌మాచారం. తెలుగు మాట్లాడే అమ్మాయిల‌ను హ‌రీష్ శంక‌ర్ త‌ర‌చూ ప్రోత్స‌హిస్తుంటారు. తాజాగా కృష్ణ మంజూష‌ను కూడా అలాగే తీసుకున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమాను 14 రీల్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు. త‌మిళంలో రిలీజ్ అయిన 'జిగ‌ర్తండ‌' చిత్రానికి ఇది రీమేక్‌.

More News

నాగార్జున 'మ‌న్మ‌థుడు 2' టీజ‌ర్‌ విడుదల తేదీ

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`.

చంద్రబాబుకు ఎందుకంత భయం.. ఇంకా తేరుకోలేదు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో తేరుకునే పరిస్థితి లేనట్లేనని తెలుస్తోంది.

వైఎస్ జగన్‌ను కలిసిన నిఖిల్.. రాజకీయాల్లో చర్చ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ గౌడ క‌లిశారు.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రివెంజ్ ఉంటుందా!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

ఏపీ సెక్రటేరియట్‌‌కు కత్తి మహేశ్ ఎందుకెళ్లినట్లు!?

టాలీవుడ్‌లో వివాదాలకు మారుపేరుగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఉన్నట్టుండి ఏపీ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యాడు.