Telusa Manasa: ‘తెలుసా..మనసా..’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

  • IndiaGlitz, [Wednesday,February 01 2023]

కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా శ్రీబాలాజీ పిక్చర్స్, బ్యాన‌ర్‌పై వైభ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్షా ముందాడ‌, మాధ‌వి నిర్మిస్తోన్న న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరి ‘తెలుసా..మనసా..’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఓ గ్రామంలో బెలూన్స్ అమ్ముకునే యువ‌కుడు (పార్వ‌తీశం), అదే ఊర్లో ప‌ని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత (జ‌శ్విక‌)ను ప్రేమిస్తాడు. ఇద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ వారిద్ద‌రూ ఆ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోరు. మ‌ల్లి బాబు ప‌లు సంద‌ర్భాల్లో త‌న ప్రేమ‌ను సుజాత‌తో చెప్పటానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఉన్న‌ట్లుడి మ‌ల్లి బాబు క‌ల‌లు కూలిపోతాయి. సుజాత‌కు దూరం కావాల్సి వ‌స్తుంది. మ‌రి వారిద్ద‌రూ క‌లుసుకున్నారా! అనేదే ‘తెలుసా.. మనసా..’ సినిమా.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుధవారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే అందులో రోహిణి హ‌ట్టంగ‌డి మంచంపై కూర్చుని ఉంటే ఆమె ప‌క్క‌నే హీరోయిన్‌, ఓ చిన్న బాబు కూర్చుని ఉన్నారు. మంచం ప‌క్క‌నే దానికి అనుకుని పార్వ‌తీశం కూర్చుని ఏదో ఆలోచిస్తూ క‌నిపిస్తున్నారు.

డెబ్యూ డైరెక్ట‌ర్ వైభ‌వ్ ‘తెలుసా..మనసా..’ చిత్రాన్ని న్యూ ఏజ్ ల‌వ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌సాద్ ఈద‌ర సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి పాపారావ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

న‌టీన‌టులు: పార్వ‌తీశం, జ‌శ్విక‌, రోహిణి హ‌ట్టంగ‌డి, మ‌హేష్ అచంట‌, అలీ రెజా, లావ‌ణ్య‌, మాస్ట‌ర్ అద్వితేజ్‌, వెంకీ, శివ‌, శోభ‌న్ త‌దిత‌రులు

More News

Nandamuri Taraka Ratna : తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థ్యాంక్స్

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి విషమంగానే

Sashivadane: 'శశివదనే' టైటిల్ సాంగ్ విడుదల చేసిన హరీష్ శంకర్

ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా 'శశివదనే'.

Budget 2023 : పసిడి మరింత ప్రియం.. సెల్‌ఫోన్లు చవక.. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి

2023- 24 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Union Budget 2023 : వేతన జీవులకు ఊరట, మహిళల కోసం కొత్త స్కీమ్.. కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలివే

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Taraka Ratna:తారకరత్నను బాలయ్య మృత్యుంజయ మంత్రమే రక్షిస్తోంది.. ఇదొక మిరాకిల్ : నిర్మాత వ్యాఖ్యలు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించి రకరకాల ఊహాగానాలు మీడియాలో,