Telangana: తెలంగాణకు అలర్ట్ .. వచ్చే మూడు రోజుల్లో మండిపోనున్న ఎండలు

  • IndiaGlitz, [Saturday,May 27 2023]

రోహిణి కార్తె ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు మాడు పగుల గొడుతున్నాడు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లే వారు ఎండల ధాటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లను జనం ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.

వడదెబ్బకు ఇద్దరు మృతి:

వాయువ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు తెలంగాణ వైపుగా వీస్తుండటం, పొడి వాతావరణం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ఐఎండీ తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో దాదాపు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మరోవైపు జూన్ ఒకటి నుంచి ఐదు రోజుల పాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కాగా.. వడదెబ్బ కారణంగా కరీంనగర్‌లో ఓ కానిస్టేబుల్, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన:

అటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం పార్వతీపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం వుందని తెలిపింది. ఏపీలోనూ రాబోయే మూడు రోజులు ఎండలు మండిపోతాయని వెల్లడించింది. మరోవైపు.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకుతాయని వెల్లడించింది.
 

More News

Director Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు కే.వాసు కన్నుమూత, మెగాస్టార్‌కు కోలుకోలేని షాక్

సంగీత దర్శకుడు రాజ్, సీనియర్ నటులు శరత్ బాబు మరణాల నుంచి కోలుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు కే.వాసు కన్నుమూశారు.

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. జూన్ చివరి నాటికి గరిష్ట స్థాయికి, వారానికి 6.5 కోట్ల కేసులు ..?

దాదాపు రెండున్నరేళ్ల పాటు మనిషిని నాలుగు గోడలకు పరిమితం చేసి అన్ని వ్యవస్థలను కకావికలం చేసింది కోవిడ్ రక్కసి. ఈ మహమ్మారి పీడ అంతం అయ్యిందని అనుకుంటుంటే

Dimple Hayathi: డీసీపీతో వివాదం.. హీరోయిన్ డింపుల్ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు, కుక్క తరమడంతో

డింపుల్ హయాతి..గత నాలుగు రోజులుగా వార్తల్లో నానుతోన్న పేరు. తన పని తాను కామ్‌గా చేసుకుంటూ వెళ్లే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఐపీఎస్‌తో వివాదం కారణంగా ఏకంగా పోలీస్..

Ram Charan:‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తోన్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో  వ‌ర‌ల్డ్ వైప్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

Ramya Raghupathi:నరేష్ - పవిత్రా లోకేష్‌లకు షాక్  : 'మళ్లీ పెళ్లి' రిలీజ్‌ను అడ్డుకోండి .. కోర్టుకెక్కిన రమ్య రఘుపతి

సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’’ . ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.