తిక్క కొత్త టీజ‌ర్ వ‌చ్చేసింది..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్, లారిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. తిక్క కొత్త టీజ‌ర్ ను నిన్న రిలీజ్ చేయాలి కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేసారు.

ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... అక్కినేని న‌టించిన‌ దేవ‌దాసు చిత్రంలోని జ‌గ‌మే మాయ... అనే సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. ఆత‌ర్వాత తాగోబోతు ర‌మేష్...ప్రేమ బ‌బ్బుల్ గ‌మ్ లాంటిది ముందు తియ్య‌గా ఉంటుంది త‌ర్వాత చ‌ప్ప‌గా అయిత‌ది. ప్రేమ కోసం హీరో ఏమిటి టెర్ర‌రిస్ట్ కూడా అయిపోతాడు అంటున్నాడు.ఇక తేజు యాక్ష‌న్, రొమాన్స్, ఎంట‌ర్ టైన్మెంట్ చేస్తూ క‌నిపించాడు. మొత్తానికి ఈ టీజ‌ర్ చూస్తుంటే...యాక్ష‌న్, ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌పాళ్ల‌లో ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ధ‌నుష్ ఓ పాట పాడ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కబాలి టికెట్స్ కోసం మినిష్టర్ రికమెండేషన్స్..

కబాలి ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతుంది.ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది.

మాయాబ‌జార్ ను ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు..

మాయాబ‌జార్ ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు అన‌గానే ఇదేదో కొత్త సినిమా అనుకుంటే...పొర‌పాటే. అన్న‌పూర్ణ స్డూడియోలో నాగార్జున అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

కాళ‌హ‌స్తిలో క‌బాలి పూజ‌లు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాల నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కబాలి ఫస్ట్ రివ్యూ...

కబాలి..కబాలి..కబాలి ఎక్కడ విన్న ఇదే మాట. ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది. ఆకాశమే హద్దుగా అంచనాలను ఏర్పరుచుకున్న కబాలి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

కబాలి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.