చెన్నై సేఫ్ అంటున్న త‌లైవా అండ్ టీమ్‌!!

మ‌న సీనియ‌ర్ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే భ‌య‌ప‌డుతున్నారు. వీరిని ఇంత‌లా భ‌య‌పెడుతున్నదెవ‌రో కాదు.. క‌రోనా వైర‌స్ అని తెలిసిందే. ఈ వైర‌స్ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌డం లేదు. దీంతో స్టార్స్ లొకేష‌న్స్ , షూటింగ్స్ గురించి ఆలోచించ‌డం లేదు. ఒక‌వేళ కాస్త ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత షూటింగ్స్ చేద్దామంటే.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి అస‌లు ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఇప్పుడు త‌లైవా ర‌జినీకాంత్ అండ్ టీమ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా శౌర్యం, ద‌రువు చిత్రాల ద‌ర్శ‌కుడు శివ కాంబినేష‌న్‌లో అణ్ణాత్తే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

రామోజీ ఫిలింసిటీలో ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. పూణేలో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈలోపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఆగింది. ఇప్పుడు పూణేలో చిత్రీక‌రించాలంటే ఎందుకా? అనే ప్ర‌శ్న అంద‌రిలో మొద‌లైంద‌ట‌. అందువ‌ల్ల చెన్నైలోనే పూణే త‌ర‌హా సెట్ వేసి ఇక్కడే షూటింగ్ చేస్తే బెట‌ర్ అని కూడా అనుకుంటున్నార‌ట మేక‌ర్స్‌. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, న‌య‌న‌తార‌, కీర్తిసురేశ్ కూడా న‌టిస్తున్నారు. ర‌జినీకాంత్ న‌టిస్తోన్న 168వ చిత్ర‌మిది. స‌న్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

More News

ఆరు గెట‌ప్స్‌లో ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.

సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది.

ఇళ‌య‌రాజాపై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్యలు

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌సాద్ ల్యాబ్స్ నుండి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను నాశ‌నం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే.

సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.