‘తలైవి’ షూటింగ్ కంప్లీట్.. కంగన భావోద్వేగ పోస్ట్..

  • IndiaGlitz, [Sunday,December 13 2020]

బాలీవుడ్ స్టార్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ఆధారంగా సినిమా రూపొందింది. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్ నిర్మించారు. కాగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కంగనా ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఓ భావోద్వేగ పోస్టును పెట్టింది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా దొరుకుతాయని.. ఈ పాత్రను తానెంతగానో ఇష్టపడ్డానని కంగన వెల్లడించింది.

ఇలాంటి పాత్ర నటులకు చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ పాత్రను నేను ఎంతగానో ప్రేమించాను. విప్లవ నాయకురాలి పాత్ర. సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. డైరెక్టర్‌ విజయ్‌, విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్, విజయేంద్ర ప్రసాద్‌, బృంద ప్ర‌సాద్‌, నీతా లుల్లా, ర‌జ‌త్ స‌రోరా, బ‌ల్లూస‌లూజ‌, జీవీ ప్ర‌కాశ్, అర‌వింద స్వామి వంటి వారితో కలిసి నటించడం జీవితంలో దొరికి అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి యూనిట్‌ను వదిలిపోవడం బాధగా ఉంది. మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నాను అని కంగన ట్వీట్‌లో పేర్కొంది.

అయితే ఈ పోస్టుతో పాటు జయలలిత విక్టరీ సింబల్‌ ఉన్న ఫొటోతో పాటు తను కూడా జయలలిత గెటప్‌లో విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫోటోను జత చేసి కంగన పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్ పూర్తైంది. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన జయలలిత నెచ్చెలిగా పూర్ణ నటించారు. మరో అత్యంత కీలక పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు.

More News

వెంకటేష్ బర్త్‌డే కానుకగా.. ‘ఎఫ్ 3’ అధికారిక ప్రకటన..

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. నిన్న కొత్తగా..

భారత్‌లో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా బాగానే తగ్గింది.

తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు..

తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రధానితో కేసీఆర్ భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన కేసీఆర్..