Vaarasudu: 'వారసుడు' ఫస్ట్ సింగిల్ 'రంజితమే' విడుదల

దళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్‌ లో భారీ అంచనాలు ఉన్న వారసుడు/వారిసు చిత్రం ప్రకటించిన రోజు నుండి మాసీవ్ ప్రమోషన్‌ లతో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఇతర పోస్టర్‌ లు.. ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ రంజితమే తమిళ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. 75 మిలియన్ + వ్యూస్ ని క్రాస్ చేసి సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు అభిమానులను ఆనందపరిచే విధంగా.. మేకర్స్ రంజితమే పాట తెలుగు వెర్షన్‌ ను ఈ రోజు విడుదల చేశారు.

బ్లాక్ బస్టర్ కంపోజర్ ఎస్ థమన్ ఈ పాటని మాస్ ఫుట్‌ ట్యాపింగ్ నంబర్‌ గా స్కోర్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, అనురాగ్ కులకర్ణి, మానసి వోకల్స్ మాస్ ని మెస్మరైజ్ చేశాయి. పాటలో విజయ్, రష్మిక ల కెమిస్ట్రీ, కాస్ట్యుమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచి లిరిక్స్ తెలుగు వెర్షన్‌ కి ఫ్రెష్ నెస్ తెచ్చిపెట్టింది. తమిళ్ పాటలానే తెలుగు వెర్షన్ కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వడం ఖాయం.

ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత ఈ చిత్రానికి సహ నిర్మాతలు. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

వారసుడు/వారిసు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి విడుదల కానుంది.

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

More News

BiggBoss: 'టికెట్ టు ఫినాలే' టాస్క్ స్టార్ట్... ఇనయా- శ్రీహాన్‌ల రొమాన్స్, శ్రీసత్యకు కాలినట్లుందే..!!

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయ్యింది.

Shriya Saran : 40 ఏళ్ల వయసు, పెళ్లయి కూతురు కూడా.. అయినా ఏముందిరా బాబు

శ్రీయా శరణ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అందం , అభినయంతో ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్థానం సంపాదించారు శ్రీయ.

Namrata Shirodkar : రమేశ్ బాబు కూతురి గురించి నమ్రత పోస్ట్.. ఎవరైనా ఎమోషనల్ కావాల్సిందే

దిగ్గజ నటుడు , సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

Meena : రెండో పెళ్లికి సిద్ధమవుతోన్న మీనా.. వరుడెవరంటే..?

వివాహ బంధంలో మనస్పర్ధల కారణంగా జీవిత భాగస్వామితో విడిపోయి సింగిల్‌గా వుంటోన్న సినీతారలు ప్రస్తుతం తోడు వెతుక్కునే పనిలో పడ్డారు.

Anupama Parameswaran : స్కర్ట్‌కు ముడివేసి, నడుము చూపిస్తూ... పిచ్చేక్కిస్తోన్న అనుపమ

బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు సినిమాపై చాలా మంది మలయాళ బ్యూటీలు సందడి చేశారు.