సెప్టెంబరు 6 న 'తారామణి' విడుదల

  • IndiaGlitz, [Monday,August 19 2019]

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'తారామ‌ణి'. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై ఉదయ్ హర్ష వడ్డేల్ల , డి.వి.వెంక‌టేష్, , సంయుక్తంగా తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 6 న విడుదల కు సిద్దమవుతోంది.

ఈ సంద‌ర్భంగా..

నిర్మాతలు మాట్లాడుతూ - ఇదొక ''ట్ర‌యాంగుల‌ర్ ల‌వ్‌స్టోరీ. సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ స‌మ‌పాళ్లలో ఉంటాయి. ప్ర‌తి స‌న్నివేశం మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంటుంది. ప్ర‌స్తుతం స‌మాజంలో స్త్రీల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల నేపథ్యంలో సినిమా సాగుతుంది. ప్ర‌స్తుతం యువ‌త టెక్నాల‌జీ మాయ‌లో ప‌డి ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోన‌వుతున్నారు. ప‌లితంగా వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నార‌నే అంశాలు కూడా సినిమాలో ఉంటాయి. య‌వ‌త‌ను మెప్పించే అంశాల‌న్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా ట్రైల‌ర్‌ను యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, పాట‌ల‌ను సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌, పాట‌లకు ఆడియెన్స్ నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సెప్టెంబరు 6 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు.

More News

రజనీకాంత్ సినిమాకు బాలీవుడ్ సీక్వెల్

సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సైకలాజికల్ హారర్ ఎంటర్ టైనర్ `చంద్రముఖి`.

'ఎవరు' తో శేష్ హ్యాట్రిక్ కొట్టేశాడు: బన్నీ

క్షణం, గూఢచారి చిత్రాల తర్వాత అడివిశేష్, ఎవరు`తో  హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బన్నీ కూడా అంగీకరించాడు.

మెహ‌ర్ ఈజ్ బ్యాక్‌!

తెలుగు తెర‌కు స్టైలింగ్ చేసి, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ లో క‌ల‌రింగ్ ఇచ్చిన డైర‌క్ట‌ర్ల‌ను గురించి ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిన‌ప్పుడు మెహ‌ర్ ర‌మేష్ పేరు త‌ప్ప‌క ఉంటుంది.

నిజ‌మేనా.. ఆమేనా.. ప్ర‌భాస్‌?

`సాహో` ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌భాస్ అండ్ టీమ్ ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌చారప‌ర్వం సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డ ఎవ‌రితో ఏం మాట్లాడినా న్యూస్ అవుతోంది.

జూనియ‌ర్ బెల్లం క‌మింగ్‌!

బెల్లంకొండ జూనియ‌ర్... బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది.