Annapurna Photo Studio:తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సెకండ్ సాంగ్ లాంచ్

  • IndiaGlitz, [Thursday,May 04 2023]

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న సినిమా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది ఉపశీర్షిక పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో.

30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన మోషన్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్ చేతుల మీదుగా విడుదల చేశారు..

ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్ మాట్లాడుతూ.. ' అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఆల్బమ్ లోని సెకండ్ సాంగ్ ను నేను విడుదల చేశాను. మామూలుగా ఫార్మల్ గా బావుందని చెబుతారు. కానీ ఈ పాట నిజంగా చాలా బావుంది. మళ్లీ మళ్లీ వినాలని ఉంది. సినిమాకు మంచి వైబ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ అద్భుతమైన సౌండింగ్ చేశారు. పాటలో మంచి క్వాలిటీ కనిపిస్తోంది. నేను కొన్ని విజువల్స్ చూశాను. యాక్టింగ్ పరంగా చైతన్య, లావణ్య ఇరగదీశారు అన్నారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. '' తరుణ్‌ భాస్కర్ గారు మా పాటను విడుదల చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో వెన్నెల్లో ఆడపిల్ల అనే ఈ సెకండ్ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఫస్ట్ సాంగ్ రంగమ్మ చాలా వైరల్ అయింది. ఈ సెకండ్ సాంగ్ అంతకంటే ఎక్కువ వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరుణ్‌ భాస్కర్ గారు నాకు సైన్మ అనే షార్ట్ ఫిల్మ్ తీసినప్పటి నుంచీ తెలుసు. అప్పటి నుంచే ఆయనతో పనిచేయాలనుకుంటున్నాను. ఫైనల్ గా ఈ రకంగా తరుణ్ తో అసోసియేట్ అయ్యే అవకాశం వచ్చింది. ఫస్ట్ సాంగ్ పాడిన ఎస్పీ చరణ్‌ గారే ఈ పాటనూ పాడారు. నా సినిమాలో ఆయన పాడటం చాలా సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ ఫస్ట్ సాంగ్ రెట్రో స్టైల్ లో కంపోజ్ చేశారు. ఈ పాట కూడా బ్యూటీఫుల్ గా ఉంది. వినగానే సోల్ ఫుల్ గా అనిపిస్తోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు చెందుముద్దు గారికి ధన్యవాదాలు. బిగ్ బెన్ బ్యానర్ ద్వారా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్ కు ఇంత మంచి అవకాశం ఇచ్చిన యశ్ రంగినేని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. చివరగా మా పాటను విడుదల చేసిన తరుణ్ భాస్కర్ గారికి మరో సారి థ్యాంక్యూ. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తోన్న మా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ముందుగా మా పాటను విడుదల చేసిన తరుణ్‌ భాస్కర్ గారికి థ్యాంక్యూ. నేను తరుణ్‌ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. మొదట వచ్చిన రంగమ్మ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ ఆ పాటకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు రెండో పాటగా వెన్నెల్లో ఆడపిల్ల వస్తోంది. మొదటి పాట రంగమ్మ ఎంత నచ్చిందో.. ఈ వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ కూడా మీకు అంతే నచ్చుతుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ గారు. అలాగే శ్రీనివాస్ గారు రంగమ్మ సాంగ్ లాగానే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ విజువల్స్ మీకు బాగా నచ్చుతాయి. నా కో యాక్టర్స్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు చెందు ముద్దుగారికి చాలా థ్యాంక్స్. మేమంతా కొత్తవాళ్లమైనా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన నిర్మాత యశ్ రంగినేనిగారికి ధన్యవాదాలు.. అన్నారు.

గీత రచయిత శ్రీనివాస్ మౌళి మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమాలో మూడు పాటలు రాశాను. మొదటి పాట రంగమ్మా చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాటకోసం దర్శకుడు చెందు గారు సీన్ చెప్పడంతో పాటు కొన్ని విజువల్స్ కూడా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. రెండు రాత్రులు కష్టపడి ఈ పాటను రాశాం. నాకు ఎంతో ఇష్టమైన ఎస్పీ చరణ్‌ గారితో పాటు రజిత బాగా పాడారు. నేను రాసిన మెలోడియస్ సాంగ్స్ అన్నీ హిట్అయ్యాయి. అలాగే ఈ పాట కూడా పెద్ద హిట్ అవుతుందీ అనుకుంటున్నాను. మా ఈ ఎఫర్ట్ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని కోరుకుంటూ.. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో

నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.

More News

Talasani:నంది అవార్డులపై కాంట్రవర్సీ.. ఎవరు పడితే వాళ్లు చెబితే మేం ఎందుకిస్తాం : తలసాని సంచలన వ్యాఖ్యలు

నంది అవార్డ్‌లపై ఇటీవల సినీ ప్రముఖులు పోసానీ కృష్ణమురళీ, అశ్వినీదత్‌ల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్

Directors Day : దర్శకరత్న దాసరి జయంతి .. నేడు డైరెక్టర్స్ డే, దర్శకుడికి స్టార్ స్టేటస్ తెచ్చిన మహనీయుడు

దర్శకరత్న దాసరి నారాయణరావు.. ఈ పేరు తెలియనివారుండరు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా,

Johnny Movie : పవన్ కళ్యాణ్ ‘‘జానీ’’ మూవీ రిజల్ట్‌పై సంయుక్త మీనన్ సంచలన వ్యాఖ్యలు

‘‘జానీ ’’.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి, ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకం.

Khushbu:కుష్భు తొందరపాటు, శరత్ బాబు మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు ..  క్లారిటీ ఇచ్చిన సోదరి

సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి.

Sarath Babu : శరత్ బాబు మరణించారంటూ కథనాలు .. క్లారిటీ ఇచ్చిన సోదరి

సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి.