close
Choose your channels

ఆ క్రెడిట్ మహేష్ దే

Monday, September 25, 2017 • తెలుగు Comments

ఓవ‌ర్‌సీస్‌లో  సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకి ఉన్న క్రేజే వేరు. సినిమా ఎలా ఉన్నా.. మిలియ‌న్ డాల‌ర్స్ అవ‌లీల‌గా వ‌చ్చేస్తుంటాయి. దూకుడుతో అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌కి శ్రీ‌కారం చుట్టారు మ‌హేష్‌. ఆ త‌రువాత వ‌చ్చిన బిజినెస్‌మేన్‌ని మిన‌హాయిస్తే.. వ‌రుస 5 చిత్రాలు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, 1-నేనొక్క‌డినే, ఆగ‌డు, శ్రీ‌మంతుడు, బ్ర‌హ్మోత్స‌వం ఈ మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరాయి.

ఇక కొత్త చిత్రం స్పైడ‌ర్ అయితే విడుద‌ల‌కి ముందే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల ని ప్రీమియ‌ర్స్‌కే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సొంతం చేసేసుకుంది. అంటే.. మిలియ‌న్ డాల‌ర్స్ ఒక్క రోజులోనే సొంతం చేసుకునే అవ‌కాశం స్పైడ‌ర్‌కి ఉంద‌న్న‌మాట‌. దీంతో.. వ‌రుస‌గా ఆరు చిత్రాల‌తో మిలియ‌న్ డాల‌ర్ల సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ట్ల‌వుతుంది మ‌హేష్‌కి. మొత్త‌మ్మీద‌.. మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన తొలి ఘ‌న‌త మ‌హేష్‌దే కానుంద‌న్న‌మాట‌.