close
Choose your channels

ఆ హీరో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు...

Sunday, May 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ హీరో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు...

వ్యోమ‌గామి రాకేశ్‌ శ‌ర్మ బ‌యోపిక్ `సారే జ‌హాసే అచ్చా`. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ న‌టిస్తాడ‌ని అనుకున్నారు. చివ‌ర‌కు షారూక్ చేతికి ప్రాజెక్ట్ వెళ్లింది. అయితే ఆయ‌న కూడా త‌ప్పుకున్నాడు. ర‌ణ‌వీర్ సింగ్‌, ర‌ణ‌భీర్ క‌పూర్‌, రాజ్‌కుమార్‌రావ్ ఇలా హీరోలంద‌రూ ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. చివ‌ర‌కు `యురి` ఫేమ్ విక్కీ కౌశ‌ల్ రాకేశ్ శ‌ర్మ‌క‌న‌ప‌డ‌తాడ‌ని అన్నారు. అయితే ఇప్పుడు విక్కీ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడ‌ట‌. ఎందుకంటే యురి` దేశ‌భ‌క్తికి సంబంధించిన సినిమా దీని త‌ర్వాత విక్కీ చేస్తోన్న‌ స‌ర్దార్ ఉద్ధ‌మ్ సింగ్ బ‌యోపిక్‌, త‌క్త్ ఇలా అన్ని వ్య‌క్తికి సంబంధించిన చిత్రాలు, బ‌యోపిక్స్‌. ఇక‌పై చేయ‌బోయే సినిమా జ‌న‌ర‌ల్‌గా ఉండాల‌నుకుని `సారే జ‌హాసే అచ్చా` నుండి విక్కీ కూడా త‌ప్పుకున్నాడ‌ట‌. మ‌రిప్పుడు ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏం చేస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.