close
Choose your channels

అందుకు నో చెప్పిన బొమ్మాళీ!!

Friday, July 31, 2020 • తెలుగు Comments

అందుకు నో చెప్పిన బొమ్మాళీ!!

బొమ్మాళీ అంటే మ‌న‌కు చ‌టుక్కున గుర్తుకొచ్చేది అనుష్క శెట్టి. అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌లు చేస్తూ వ‌చ్చిన ఈ బెంగళూరు బ్యూటీ అరుంధతి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారింది. త‌ర్వాత బాహుబ‌లిలో దేవ‌సే, భాగ‌మ‌తి చిత్రాల‌తో విజ‌యాల‌ను సాధించింది. ఇప్పుడు ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌రో చిత్రం ‘నిశ్శబ్దం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అనుష్క ఏ సినిమా చేస్తుంద‌నే దానిపై క్లారిటీ లేదు. సోష‌ల్ మీడియాలో మాత్రం ప‌లు ర‌కాలైన వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌చ్చిందట‌. అయితే అందుకు అనుష్క సింపుల్‌గా నో చెప్పేసింద‌ని టాక్‌.

ప్ర‌స్తుతం ట్రెండ్‌కు అనుగుణంగా మ‌న స్టార్స్ అంద‌రూ ఓటీటీల్లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే శ్రుతి, నిత్యామీన‌న్‌, కియారావంటి తార‌లు ఓటీటీల్లో క‌న‌ప‌డి అభిమానులను మెప్పించారు. ఇక త‌మ‌న్నా, సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్, కాజ‌ల్ అగ‌ర్వాల్ వంటి వారు త్వ‌ర‌లోనే వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ ఓ వెబ్ సిరీస్ కోసం అనుష్క‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే అనుష్క‌కు ఆస‌క్తి లేక‌పోవ‌డంతో ఆమె సింపుల్‌గా నో చెప్పేశార‌ని టాక్ వినిపిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz