అందుకే..ఆడియోన్స్ ప్రార్థన క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతున్నారు. - హీరోయిన్ పల్లక్ లల్వాని

  • IndiaGlitz, [Monday,January 04 2016]

నాగ‌శౌర్య‌, ప‌ల్ల‌క్ ల‌ల్వాని జంటగా న‌టించిన చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రాన్ని ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కించారు. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజైన అబ్బాయితో అమ్మాయి మూవీ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అబ్బాయితో అమ్మాయి గురించి హీరోయిన్ ప‌ల్ల‌క్ ల‌ల్వాని ఇంట‌ర్ వ్యూ మీకోసం...

ఈ సినిమాలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?

నాన్న‌గారు జితేంద్ర. హిందీ సినిమాల్లో న‌టించారు. అమ్మ పంజాబి. నేను ముంబాయిలో పెరిగాను. నాన్న‌లాగే నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. ఓ సౌత్ సినిమా ఆడిష‌న్ కోసం ఫోటోలు పంపించాను. డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ గారు నా ఫోటోలు ఎక్క‌డ చేసారో..ఈ సినిమాలో న‌టించ‌మ‌ని ముంబాయి వ‌చ్చి అమ్మ‌ని క‌లిసి క‌థ చెప్పారు. క‌థ న‌చ్చ‌డంతో ఓకె చెప్పాను. అలా ఈ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది.

ప‌ల్ల‌క్ కి, ప్రార్ధ‌న క్యారెక్ట‌ర్ కి డిఫ‌రెన్స్ ఏమిటి..?

నేను డిగ్రీ చ‌దువుతున్నాను. కానీ... సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో లేను. ఈ సినిమాలో ప్రార్థ‌న మాత్రం సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ఎక్టీవ్ గా ఉంటుంది. ప్ర‌జెంట్ యూత్ ఎలా ఉన్నారో అలా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. అందుక‌నే ఆడియోన్స్ ప్రార్థ‌న క్యారెక్ట‌ర్ కి క‌నెక్ట్ అవుతున్నారు.

ఈ సినిమాలో న‌టించేట‌ప్పుడు లాంగ్వేజ్ విష‌యంలో ఇబ్బంది ప‌డ్డారా..?

నాకు తెలుగు రాదు క‌నుక డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు కాస్త క‌ష్టంగా అనిపించింది. అయితే డైలాగ్స్ ను ముందు నుంచి బ‌ట్టీప‌ట్ట‌డ‌డం...యూనిట్ స‌భ్యులు స‌హ‌క‌రించ‌డంతో పెద్ద‌గా ఇబ్బంది ఫీల‌వ్వ‌లేదు.

అబ్బాయితో అమ్మాయి గురించి మీకు వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?

ఈ సినిమాకి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఇది నా మొద‌టి సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో న‌టించ‌లేదు. మోడ‌లింగ్ కూడా చేయ‌లేదు. అలాంటిది నా ఫ‌స్ట్ మూవీకే ఫ‌ర్ ఫార్మెన్స్ స్కోప్ వున్న క్యారెక్ట‌ర్ చేయ‌డం సంతోషంగా ఉంది. అలాగే నా క్యారెక్ట‌ర్ కి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డం చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమాలో న‌టించ‌క ముందు తెలుగు సినిమాలు చూసారా..?

బొమ్మ‌రిల్లు సినిమా చేసాను. నాకు చాలా బాగా న‌చ్చింది. ఈ సినిమాలో జెనీలియా క్యారెక్ట‌ర్ చాలా బాగుంటుంది. ఆమె న‌ట‌న చూసి చాలా ఇన్ స్పైయిర్ అయ్యాను. అలాగే ఓకె బంగారం సినిమా కూడా చేసాను. దుల్క‌ర్ స‌ల్మాన్ చాలా బాగా న‌టించాడు.

తెలుగులో మీ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు..?

మ‌హేష్ అంటే చాలా ఇష్టం. ఎవ‌రితో న‌టించాల‌నుకుంటున్నారు అని అడిగితే...ఫ‌స్ట్ మ‌హేష్ పేరే చెబుతాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

ప్ర‌స్తుతం డిష్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇంకా ఫైన‌ల్ కాలేదు. త్వ‌ర‌లో మిగిలిన వివ‌రాలు తెలియ‌చేస్తాను.

More News

న్యూస్ ఛానల్ పై రామ్ ఫైర్...

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన నేను..శైలజ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో మంచి టాక్ తో దూసుకెళుతుంది.

మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వం లో నారా రోహిత్ 'కథలో రాజకుమారి' పాటల రికార్డింగ్!

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం 'కథలో రాజకుమారి' చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది.

అమితాబ్ ను రజనీ వద్దన్నాడట...

రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం '2.0' సీక్వెల్ ఆఫ్ రోబో.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది.

రజనీకాంత్ రిలీజ్ డేట్ మారింది...

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మహదేవ్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

మ‌హేష్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్...ఎక్కువుగా మాట్లాడ‌రు..ఎక్కువ మందితో క‌ల‌వ‌రు. మీడియాతో అస‌లు క‌ల‌వ‌రు..మాట్లాడ‌రు.. అలాంటి మ‌హేష్ లో చాలా మార్పు వ‌చ్చింది.