close
Choose your channels

కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

Tuesday, September 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

కరోనా వైరస్‌లో చైనాలోని వూహాన్‌లో పుట్టిందంటూ ఎన్నో వాదనలు ఆది నుంచి వినబడుతున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి వూహాన్‌లోనే పుట్టిందంటూ చైనా వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనడానికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని డాక్టర్ లీ మెగ్ యాన్ స్పష్టం చేశారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌‌లో డాక్టర్ లీ.. కరోనా వైరస్‌పై గతేడాది నుంచి పరిశోధనలు చేస్తున్నారు.

కాగా.. డాక్టర్ లీ తాను గుర్తించిన విషయాలను వెల్లడించారు. న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించానని.. అది వుహాన్‌లోని ల్యాబ్‌లో తయారైనట్లు తెలిసిందన్నారు. ఆ వెంటనే తాను వైరస్‌కు సంబంధించి హెచ్చరికలు చేశానని.. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ.. చైనా అధికారులు కానీ పట్టించుకోలేదని డాక్టర్ లీ వెల్లడించారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా తన హెచ్చరికలను బేఖాతరు చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదని.. వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని డాక్టర్ లీ స్పష్టం చేశారు.

వూహాన్ ల్యాబ్‌లో పుట్టిన వైరస్‌ను సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో పుట్టిందని ప్రపంచాన్ని భ్రమల్లో ఉంచారని డాక్టర్ లీ తెలిపారు. వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలూ చైనా అధికారులకు తెలుసన్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్న విషయం కూడా తెలుసని అయినా బయటకు తెలియనివ్వలేదన్నారు. వైరస్ గురించి మాట్లాడినందుకు తనను బెదిరించారని.. తన గురించి దుష్ప్రచారం చేశారని.. తన పరిశోధనకు సంబంధించిన సమాచారన్నంతా ధ్వంసం చేశారని డాక్టర్ లీ తెలిపారు. ఆ సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు అమెరికాకు పారిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. కాగా.. లీ ఆరోపణలన్నింటినీ వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ తోసిపుచ్చగా. చైనా అధికారులెవరూ స్పందించలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.