గుండె పగిలే వార్త ఇది.. ధీర యువతి ఇకలేరు!

  • IndiaGlitz, [Friday,May 14 2021]

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం అల్లకల్లోలంగా మారుతోంది. ఎంతో మంది రోగులు ఆసుపత్రిల్లో బెడ్స్‌పై బతుకుతామనే ఆశను ఊపిరిగా చేసుకుని గడుపుతున్నారు. ఇటీవల ఒక యువతికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ యువతి ‘లవ్ యూ జిందగీ’ సాంగ్‌ పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. కరోనాతో బాధపడుతున్న ఆమె కండీషన్ ఆ సమయంలో ఒకింత సీరియస్‌గానే ఉంది. ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నప్పటికీ చాలా ధైర్యంగా కూర్చొని సాంగ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియోను ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ మోనిక పోస్ట్ చేశారు.

Also Read: ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు

తనను ‘లవ్ యూ జిందగీ’ సాంగ్ పెట్టివ్వమని అడిగిందని.. ఈ ధైర్యమైన యువతి కోలుకోవాలని డాక్టర్ మోనిక ట్వీట్‌లో కోరారు. కొన్ని సార్లు మనం నిస్సహాయులం అవుతామని.. మన చేతుల్లో ఏమీ ఉండదని.. అంతా భగవంతుడి దయ అని మోనిక మే 8న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో సదరు యువతి ఎంజాయ్ చేస్తున్న వీడియోను సైతం షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆమె విల్ పవర్, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని పెద్ద ఎత్తున కోరుకున్నారు. కానీ ఆ యువతి నేడు మరణించింది. ఈ విషయాన్ని డాక్టర్ మోనిక ట్విటర్ ద్వారా వెల్లడించారు.

‘చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం’ అని డాక్టర్ మోనిక యువతి మరణవార్తను వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. యువతి మరణవార్తపై ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం స్పందించారు. చాలా చాలా బాధగా ఉంది. ఆమె తన కుటుంబాన్ని తిరిగి చూడలేరని నేనెప్పుడూ ఊహించలేదు. జీవితం అనేది చాలా అన్‌ఫెయిర్‌గా ఉంది. జీవించేందుకు అర్హులైన చాలా జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి’’ అంటూ ఆవేదనగా ట్వీట్ చేశారు.

More News

తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్

తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు అంబులెన్స్‌లను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

‘లూసిఫర్’ అప్‌డేట్.. ఆయన తప్పుకోలేదట

కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి కాలంలో కొద్ది రోజులుగా మూవీ అప్‌డేట్స్ ఏవీ లేకుండా పోయాయి.

అంద‌రి దృష్టి ఇటే!... నేడే స్పార్క్ ఓటీటీ ప్రారంభం!

క‌రోనా సెకండ్ వేవ్ వినోద రంగంలో ఓటీటీ విస్త‌ర‌ణ‌కు మ‌రో మంచి అవ‌కాశం కల్పించింది. ఇప్ప‌టికే ఈ రంగంలో కొన‌సాగుతున్న ఓటీటీ వేదిక‌ల‌కు పెను స‌వాల్ విసురుతూ ‘స్పార్క్ ఓటీటీ’ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది.

జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్

కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన అనంతరం కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌కు షిఫ్ట్ అయిపోయిన విషయం తెలిసిందే.

అరేబియాలో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపాను అలర్ట్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 16, 17 తేదీల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.