కోవిడ్ టైంలో చైనా కుట్ర.. సంచలన పాయింట్ తో ఫ్యామిలీ మ్యాన్ 3!

  • IndiaGlitz, [Saturday,June 05 2021]

మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి సీజన్ 2కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మనోజ్ బాజ్ పాయ్, సమంత పెర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇదీ చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' హీరోయిన్

సీజన్ 2 చివరి ఎపిసోడ్ లో సీజన్ 3కి సంబంధించిన హింట్స్ వదిలారు దర్శకులు రాజ్ అండ్ డీకే. తొలి సీజన్ లో పాకిస్తాన్, రెండవ సీజన్ లో శ్రీలంక నేపథ్యం ఎంచుకున్న దర్శకులు మూడవ సీజన్ కోసం చైనా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు. సీజన్ 2 చివర్లో ఇదే చూపిస్తారు.

ఇక బాలీవుడ్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం రాజ్ అండ్ డీకే సంచలన పాయింట్ ని కథా నేపథ్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఇండియాలో విధ్వంసం సృష్టించేందుకు చైనా 'గౌన్ యు ' అనే మిషన్ చేపడుతుంది. ఈ మిషన్ ని డెస్ట్రాయ్ చేయడమే 'టాస్క్'కి అప్పగించే పని.

గౌన్ యు చైనా పురాతన కాలానికి చెందిన సైన్యాధ్యక్షుడు. అతడి పేరుపైనే చైనా ఈ మిషన్ చేపడుతుందట. మరి ఫ్యామిలీ మ్యాన్ 3 తో దర్శకులు ఎలాంటి థ్రిల్ అందిస్తారో చూడాలి.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీలంక తమిళ రెబల్ గా సమంత నటన అద్భుతంగా ఉంది. యాక్షన్స్ సీన్స్ లో సమంత అదరగొట్టింది.

More News

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' హీరోయిన్

క్రేజీ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించింది. రిచా 2019లో వివాహం చేసుకుని నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది.

మహేష్, కమల్ హాసన్ పాన్ ఇండియా మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే ?

బాహుబలి ప్రభంజనం తర్వాత సౌత్ లో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలయింది. పదుల సంఖ్యలో పాన్ ఇండియా చిత్రాలకు ప్రకటనలు వస్తున్నాయి.

చిరంజీవి సోదరిగా బాలయ్య హీరోయిన్?

ఆచార్య పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవి మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో నటించబోతున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 2 (వెబ్ సిరీస్) రివ్యూ

2019లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.

స్వీట్ షాక్ : క్రేజీ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి.. అంతా సడెన్ గా..

హీరోయిన్ యామి గౌతమ్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. క్రేజీ డైరెక్టర్ తో ఆమె పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది.