close
Choose your channels

'ది ఘోస్ట్' సెప్టెంబర్ 25న ప్రీరిలీజ్ ఈవెంట్

Wednesday, September 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. నాగార్జున- సోనాల్ చౌహాన్ ల అద్భుతమైన కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.

తర్వాతి భారీ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.