Rajamouli:జపాన్‌లో భూకంపం చూసి భయపడిన రాజమౌళి ఫ్యామిలీ

  • IndiaGlitz, [Thursday,March 21 2024]

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కుటుంబం ప్రస్తుతం జపాన్ దేశం వెకేషన్‌లో ఉన్నారు. తాజాగా అక్కడ భూకంపం వచ్చిందని.. చాలా భయం వేసిందంటూ ఎస్ ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జపాన్‌లోని ఓ పెద్ద బిల్డింగ్‌లో 28వ ఫ్లోర్‌లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంతసేపటికి ఇది భూకంపం అని తెలిసి భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో అనుభూతి చెందాం. అంటూ భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌‌‌ను ఫోటో తీసి ఈ పోస్ట్‌తో పాటు పెట్టారు. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. జక్కన్న కుటుంబం క్షేమంగా తిరిగి రావాల‌ని కోరుకుంటున్నారు.

అయితే జపాన్‌లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో 46 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. తమ దేశంలో భూకంపాలు సర్వసాధారణమని.. ప్రస్తుతం వచ్చింది చిన్న భూకంపం అని రాజమౌళి కుటుంబానికి జపాన్ వాసులు ధైర్యం చెప్పారట.

RRR సినిమా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో మాత్రం ఓ భారతీయ సినిమాకి పెద్ద ఎత్తున గుర్తింపు రావడం మాత్రం ఇదే తొలిసారి. 2022 అక్టోబర్‌లో ఈ సినిమా జపాన్‌లో రిలీజైంది. అప్పటి నుంచి ఈ చిత్రం థియేటర్లో ప్రదర్శితమవుతూనే ఉంది. ఈ సినిమాను ఇంతలా ఆదరిస్తున్న జపనీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌బాబుతో తాను తీయబోయే చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

నా తదుపరి చిత్రం మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. అతడి పేరు మహేష్ బాబు.. తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను అంటూ రాజమౌళి వెల్లడించారు.

More News

Loksatta JP:ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా జేపీ మద్దతు.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు..

ఏపీలో ఎన్డీఏ(టీడీపీ-బీజేపీ-జనసేన) కూటమికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Jaya Prakash Narayana)  తెలిపారు.

Janasena: పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన పిఠాపురం కీలక నేత..

ఎన్నికల ముందు జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. అందులోనూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు.

YS Sharmila: వైసీపీ ఓటు బ్యాంకే షర్మిల టార్గెట్‌.. కాంగ్రెస్‌లో ఊపందుకున్న చేరికలు..

ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి మెల్ల మెల్లగా చేరికలు జోరందుకుంటున్నాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా హస్తం కండువా కప్పునేందుకు సిద్ధమవుతున్నారు.

Ustad Bhagat Singh:'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్‌ డైలాగ్స్‌పై ఈసీ ఏమందంటే..? వారికి వార్నింగ్..

ఏపీలో ఎన్నికల వేళ పవన్ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్‌లోని డైలాగులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేత వర్మ షాక్.. పోటీలో ఉంటానని స్పష్టం..

కాకినాడ ఎంపీ అభ్యర్థిగా టీటైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.