రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోంది


Send us your feedback to audioarticles@vaarta.com


తను తయారుచేసిన రెడ్ బుక్ పై మరోసారి స్పందించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతోందని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ లో మాట్లాడిన లోకేష్.. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రతీ ఎన్నికలో విజయం కూటమిదేనని లోకేష్ మరోసారి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కనీవిని ఎరుగని సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని, ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు.
ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షహోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగుళూరు వెళ్లిపోయాడని విమర్శించారు.
2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైఎస్సార్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందని లోకేశ్ గుర్తు చేశారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని.. దాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. పింఛన్ పెంచినా, అన్న క్యాంటీన్లు ప్రారంభించినా, తల్లికి వందనం ప్రారంభించినా, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద నిధులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com