రామ్‌తో క‌లిసి న‌టించేబోయే స్టార్ ఎవ‌రంటే...

  • IndiaGlitz, [Friday,September 14 2018]

ఈ ఏడాది చిన్న చిత్రంగా విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన చిత్రాల్లో 'ఆర్‌.ఎక్స్ 100' ఒక‌టి. వర్మ శిష్యుడైన అజ‌య్ భూప‌తి సినిమాను డీల్ చేసిన తీరుకి మంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అజ‌య్‌కి ద‌ర్శ‌కుడిగా వ‌రుస అవ‌కాశాలు వచ్చాయి. ప్ర‌స్తుతం రామ్ హీరోగా స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌లో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి అజ‌య్ సిద్ధ‌మ‌య్యారు.

ఇంత‌కు రామ్‌తో న‌టించ‌బోయే మ‌రో హీరో ఎవ‌రో.. అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రో హీరోగా న‌టిస్తాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ట‌. రామ్ హీరోగా న‌టించిన 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది.

More News

రహస్యం పోస్టర్ ని విడుదల చేసిన వినాయక్

భీమవరం టాకీస్  అధినేత  తుమ్మలపల్లి .రామసత్యనారాయణ గారు మంచి షార్ట్ ఫిలిమ్స్  టీం అయినటువంటి సాగరశైలేశ్  టీం కి అవకాశమిచ్చి

హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తోనే...

కన్న‌డ‌లో కిర్రిక్ పార్టీతో స‌క్సెస్ కొట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. తెలుగులో నాగ‌శౌర్య 'ఛ‌లో'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూప‌ర్‌హిట్ అయ్యింది.

మ‌ళ్లీ తండ్రి అయిన గోపీచంద్‌

హీరో గోపీచంద్ మ‌రోసారి తండ్రి అయ్యారు. ఆయ‌న స‌తీమ‌ణి రేష్మా వినాయ‌క చ‌వితి రోజున ఓ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు.

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న '2.0' టీజ‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీ జాక్స‌న్ న‌టీన‌టులుగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

'దీర్ఘఆయుష్మాన్ భవ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా  ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం "దీర్ఘఆయుష్మాన్ భవ".