close
Choose your channels

జో బైడెన్ తొలి ప్రసంగం వెనుక తెలుగోడి ప్రతిభ..

Saturday, January 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జో బైడెన్ తొలి ప్రసంగం వెనుక తెలుగోడి ప్రతిభ..

దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10- 30 గంటలకు.. అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. బైబిల్ పుస్తకంపై చేయి ఉంచి మరీ జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడు జో బైడెనే కావడం విశేషం. ఆయనకు 78 ఏళ్లు. ఈ సందర్భంగా బైడెన్ ప్రసంగం ఆకట్టుకుంది. అయితే ఆ ప్రసంగాన్ని రాసిన వ్యక్తి భారతీయ అమెరికన్ కావడం విశేషం.. అందునా తెలుగువాడు.. తెలంగాణవాడు కావడం మరింత ఆసక్తికరం.

అమెరికా అధ్యక్షుడికి ప్రసంగం రాసిన తొలి భారతీయ అమెరికన్‌గా చొల్లేటి వినయ్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. ‘అమెరికా యునైటెడ్’ థీమ్‌తో ఆయన ఈ ప్రసంగాన్ని రాశారు. ఒహియోలోని డేటన్‌లో నివసిస్తున్న వినయ్.. ఒబామా హయాంలో ప్రసంగ రచయితగా పని చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్‌. 40 ఏళ్ల కిందటే ఆయన అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వినయ్‌రెడ్డి విద్యాభ్యాసమంతా అమెరికాలోనే కొనసాగింది. దీంతో ఆంగ్లంపై మంచి పట్టుతో పాటు స్థానిక సమస్యలపై మంచి అవగాహన ఉంది. దీంతో బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్‌గా వినయ్‌రెడ్డి ఎంపికయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ.. ఈరోజు అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిన రోజని.. అధ్యక్షుడిగా దేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని, అమెరికాను పరిరక్షిస్తానన్నారు. మీకు ఇవ్వగలిగిందంతా ఇస్తానని... చేయగలిగిందంతా చేస్తానన్నారు. అధికారం గురించి కాదు, అవకాశాల గురించి పాటుపడతానని జో బైడెన్ వెల్లడించారు. వ్యక్తిగత లాభం కోసం కాదు, ప్రజా క్షేమానికి కృషి చేస్తానని.. మనమంతా కలిసి ఓ కొత్త చరిత్రను లిఖిద్దామన్నారు. తనను నమ్మాలని... ఎప్పుడూ మీకు నిజమే చెబుతానని.. నిజాయితీగా ఉంటానని జో బైడెన్ వెల్లడించారు. బైడెన్ పలుకులన్నీ వినయ్‌రెడ్డి కలం నుంచి జాలువారినవే కావడం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.