close
Choose your channels

యూపీలో టీకా తీసుకున్న మరుసటి రోజే వార్డు బాయ్ మృతి

Monday, January 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ్యాక్సినేషన్ డ్రైవ్‌ తొలిరోజు టీకా తీసుకున్న వార్డు బాయ్ ఆ మరుసటి రోజే మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. టీకా తీసుకున్న అనంతరం భారత్‌లో అస్వస్థతకు గురైన కేసులను చూశాము కానీ మృతి కేసు మాత్రం ఇదే మొదటిది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ విషాదం వెలుగు చూసింది. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఛాతీనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.

దీంతో వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మహిపాల్ సింగ్ మృతి చెందాడు. ఈ ఘటనపై మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇస్తూ, మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌ కారణంగానే మహిపాల్ మరణించినట్టు తాను భావించడం లేదని చెప్పారు. అతని మృతికి అసలైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకూ ఇతర దేశాల్లో మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం పలువురు మరణించిన ఘటనలు నమోదయ్యాయి. ఇండియాలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా.. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న 22 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఐసీయూకి తరలించారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎలర్జీతో రియాక్షన్ తలెత్తిందని, తలపోటు, ర్యాష్, రెస్పిరేటరీ డిస్ట్రస్‌తో బాధపడడ్డాడని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.